Begin typing your search above and press return to search.

ది ఇండియన్ హౌస్.. మరోసారి ఆ లెజెండరీ యాక్టర్

లండన్ లో ఉన్న ఇండియన్ హౌస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉంటుందంట. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Aug 2024 6:12 AM GMT
ది ఇండియన్ హౌస్.. మరోసారి ఆ లెజెండరీ యాక్టర్
X

టాలెంటెడ్ యాక్టర్ నిఖిల్ కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా కథలపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా స్వయంభు అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా హిస్టారికల్ ఫిక్షనల్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం నిఖిల్ యుద్ధవిద్యలు నేర్చుకున్నాడు. ఇదిలా ఉంటే రియలిస్టిక్ సంఘటనల నేపథ్యంలో మరో పీరియాడికల్ జోనర్ మూవీ కూడా నిఖిల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ది ఇండియన్ హౌస్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. రామ్ వంశీకృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

లండన్ లో ఉన్న ఇండియన్ హౌస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉంటుందంట. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. నిఖిల్ ఈ సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తున్నాడనేది ఇంకా క్లారిటీ లేదు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సాయీ మంజ్రేకర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కోసం హిస్టారికల్ హంపి సెట్ వేసారంట. అందులోనే షూటింగ్ ని స్టార్ట్ చేసారంట. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత అనుపమ్ ఖేర్ కార్తికేయ 2 సినిమాలో కూడా నటించాడు. ఇప్పుడు ది ఇండియన్ హౌస్ కోసం మరో సారి వర్క్ చేస్తున్నారు.

చిత్ర యూనిట్ అనుపమ్ ఖేర్ మూవీ సెట్ లో జాయిన్ అవుతున్నట్లు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇందులో అనుపమ్ ఖేర్ పంచెకట్టు, సూట్ లో ఉండటం విశేషం. నిఖిల్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ 1905 నేపథ్యంలో జరిగే పీరియాడిక్ డ్రామాగా ఉండబోతోందని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది.

స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన కీలక ఘట్టాలని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారంట. ది కాశ్మీర్ ఫైల్స్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నుంచి వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు అలాంటి రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ది ఇండియన్ హౌస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందనేది వేచి చూడాలి.