Begin typing your search above and press return to search.

కూతురి పెళ్లి కోసం స్టార్ డైరెక్ట‌ర్ న‌టన‌లోకి

త‌న కుమార్తె ఆలియా క‌శ్య‌ప్ ఇటీవ‌ల ప్రియుడు షేన్ గ్రెగోయిర్ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ వివాహం త‌ర్వాత తాను చాలా ప్ర‌శాంతంగా ఉన్నాన‌ని అనురాగ్ అన్నారు.

By:  Tupaki Desk   |   2 Jan 2025 4:09 AM GMT
కూతురి పెళ్లి కోసం స్టార్ డైరెక్ట‌ర్ న‌టన‌లోకి
X

బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ క‌శ్య‌ప్ ఇటీవ‌ల బాలీవుడ్ పై విరుచుకుప‌డుతున్నారు. ఏడాది త‌ర్వాత ముంబై వ‌దిలి సౌత్ ప‌రిశ్ర‌మల‌కు వెళ్లిపోతున్నాన‌ని కూడా ప్ర‌క‌టించాడు. బాలీవుడ్ ఒరిజిన‌ల్ క‌థ‌ల్ని వ‌దిలేసి రీమేక్ ల‌పై ఆధార‌ప‌డుతోంద‌ని, మంచి క‌థ‌ల‌ను వెతక‌డంలో పెద్ద హీరోలు కూడా విఫ‌ల‌మ‌వుతున్నార‌ని అనురాగ్ విమ‌ర్శించారు.

ఇదే ఇంట‌ర్వ్యూలో త‌న కుమార్తె పెళ్లి ఎలా చేశాడో కూడా చెప్పాడు. కుమార్తె పెళ్లి కోసం సంపాదించాల‌నుకున్నాన‌ని కూడా వెల్ల‌డించాడు. తాను న‌టించ‌డానికి కార‌ణం డ‌బ్బు సంపాదించి ఆలియా పెళ్లి చేయాలి. పెళ్లి చేయ‌డం అంటే చిన్న సినిమా బ‌డ్జెట్ పెట్ట‌డ‌మే. అందుకే నేను న‌టించాను అని అన్నాడు. త‌న కుమార్తె ఆలియా క‌శ్య‌ప్ ఇటీవ‌ల ప్రియుడు షేన్ గ్రెగోయిర్ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ వివాహం త‌ర్వాత తాను చాలా ప్ర‌శాంతంగా ఉన్నాన‌ని అనురాగ్ అన్నారు.

అనురాగ్ కశ్యప్, అతడి మాజీ భార్య ఆర్తీ బజాజ్ ల‌ కుమార్తె ఆలియా కశ్యప్. కుమార్తె ప్రేమ వివాహానికి అనురాగ్ అంగీక‌రించ‌డ‌మే గాక ఈ జంట డేటింగ్ లైఫ్ కి ఆయ‌న స‌పోర్ట్ చేసారు. ఇటీవ‌ల ఘ‌నంగా పెళ్లి కూడా జ‌రిపించారు. తాజాగా 2025 కోసం తన ప్రణాళికల గురించి హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడుతూ అనురాగ్ చాలా సంగ‌తులు ముచ్చించారు.

వచ్చే సంవత్సరం నేను సినిమా చేయను. విశ్రాంతి తీసుకోవడానికి, చైతన్యం నింపడానికి సినిమాలు చూడబోతున్నాను. ఈ సంవత్సరం సినిమాలు చేయడానికి, చాలా న‌టించ‌డానికి కేటాయిస్తున్నాను... అని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో అన్నారు అనురాగ్. భ‌విష్య‌త్ లో హిందీ ప‌రిశ్ర‌మ వ‌దిలి వెళ్లిపోతున్నాన‌ని కూడా అన్నాడు.