ఆ డైరెక్టర్ కం నటుడు టాలీవుడ్ లోనూ దిగుతున్నాడా?
యంగ్ హీరో అడివిశేష్ కథానాయకుడిగా షనీల్ డియో దర్శకత్వంలో `డెకాయిట్` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో శేష్ కు జోడీగా మృణాల్ ఠాకూరు నటిస్తోంది.
By: Tupaki Desk | 28 Feb 2025 7:32 AM GMTయంగ్ హీరో అడివిశేష్ కథానాయకుడిగా షనీల్ డియో దర్శకత్వంలో `డెకాయిట్` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో శేష్ కు జోడీగా మృణాల్ ఠాకూరు నటిస్తోంది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న చిత్రమిది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్ కి చేరాయి. అడవి శేష్ థ్రిల్లర్ చిత్రాలు మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మారడంతో? డెకాయిట్ కాన్సెప్ట్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటూ అంచనాలు తెరపైకి వస్తున్నాయి.
తొలుత టైటిల్ టీజర్ తోనే సినిమాపై బజ్ మొదలైంది. అటుపై ఒక్కో ప్రచార చిత్రం మంచి హైప్ తీసుకొచ్చింది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. కొన్ని నెలలుగా సెట్స్ లో ఉన్న చిత్రం ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు సంబంధించిన లుక్ ను నేడు మేకర్స్ ఇంటర్ డ్యూస్ చేసారు.
ఇందులో అను రాగ్ కశ్యప్ ఇన్ స్పెక్టర్ స్వామి పాత్ర పోషిస్తున్నాడు. నుదిటిన కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షలు, బ్లాక్ షర్ట్ ధరించి సీరియస్ లుక్ లో అనురాగ్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఈ పాత్ర పాజిటివ్ గా ఉంటుందా? నెగిటివ్ గా ఉంటుందా? అన్నది చూడాలి. ఈ సినిమాతో అనురాగ్ కశ్యప్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వడం ఇదే తొలిసారి.
ఇప్పటివరకూ అనురాగ్ కశ్యప్ తెలుగు సినిమాలు చేయలేదు. `డెకాయిట్` తెలుగులో పాటు హిందీలో నూ తెరకెక్కిస్తున్నారు. అయితే అనురాగ్ తమిళ, హిందీ అనువాదా చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కు సుపరిచితమే. వాటిలో నెగిటివ్ పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ నటులంతా టాలీవుడ్ పై దృష్టి పెట్టిన నేపథ్యంలో అనురాగ్ ఎంట్రీ కూడా షురూ అయింది.