విలక్షణ నటనతో షాక్‌లిస్తున్న దర్శకుడు
వరుసగా అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు అనురాగ్ కశ్యప్. ఇంతకుముందు ఏకే వర్సెస్ ఏకేలో అనీల్ కపూర్ లాంటి పెద్ద హీరోతో పాటు నటించాడు
By: Tupaki Desk | 26 Jan 2025 10:30 PM GMTవరుసగా అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు అనురాగ్ కశ్యప్. ఇంతకుముందు ఏకే వర్సెస్ ఏకేలో అనీల్ కపూర్ లాంటి పెద్ద హీరోతో పాటు నటించాడు. ఆ సినిమాలో అతడి పాత్రకు అంతగా గుర్తింపు దక్కకపోయినా, ఆ తర్వాత విజయ్ సేతుపతి లాంటి స్టార్ తో కలిసి మహారాజా లో నటించాడు. ఈ చిత్రంలో భయంకరమైన విలనీతో దుమ్ము రేపాడు. సేతుపతికి ధీటుగా నటించి మెప్పించాడన్న ప్రశంస దక్కింది. విలన్ గా అతడి పాత్ర ఎంతో సహజసిద్ధంగా ఒదిగిపోవడం చూసి సూపర్ స్టార్లు సైతం ఆశ్చర్యపోయారు.
థ్రిల్లర్ లు, యాక్షన్ డ్రామాల విలన్ గా ఇప్పుడు అనురాగ్ ఒక ఆప్షన్ గా మారిపోయాడన్న చర్చా సాగుతోంది. మహారాజాలో అతడి నటన చూశాక భారీ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు మలయాళ చిత్రం రైఫిల్ క్లబ్‌లోను మారోసారి తనదైన అద్భుత నట ప్రదర్శనతో కట్టి పడేసాడని టాక్ వినిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ప్రీమియర్ వీక్షించిన ప్రజలు ఈ సినిమా కథాంశంతో పాటు, అనురాగ్ నటన గురించి ఎక్కువగా ముచ్చటించుకుంటున్నారు.
ఇది రెగ్యులర్ కథాంశం కాదు. గ్యాంగ్ స్టర్ కథలో ఆయుధ మాఫియా గురించిన కథతో రూపొందింది. ఇందులో అనురార్ రూపం, నటన ప్రధాన అస్సెట్స్ గా మారాయి. అతడు తన పాత్రలో పరకాయం చేసిన తీరు అందరికీ నచ్చుతోంది. దిలీష్ పోతన్, విజయరాఘవన్, హనుమాన్‌కిండ్ తదితరులతో పాటు అనురాగ్ అత్యుత్తమ నటనను కనబరిచారు. ఒక దర్శకుడు నటుడిగా మారి ఇలాంటి సంచలనాలు సృష్టించడం అరుదు. కానీ అనురాగ్ నటుడిగాను అదరగొడుతున్నాడు. అతడు ఇప్పుడు సౌత్ లో పెద్ద విలన్ గా అవతరిస్తున్నాడు. తమిళంలో ఎస్.జే సూర్యకు విలన్ గా గొప్ప ఇమేజ్ ఉంది. అనురాగ్ కి కూడా అలాంటి మంచి పేరు వచ్చేస్తోంది.