Begin typing your search above and press return to search.

సెట్ లో చెఫ్ లు..వారికి రోజుకి 2 ల‌క్ష‌లు!

న‌టీన‌టుల పారితోషికాల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే! సెట్స్ కివెళ్లిన త‌ర్వాత వాళ్ల బాదుడ‌పై నిర్మాత‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదులెన్నో.

By:  Tupaki Desk   |   22 Jun 2024 5:30 PM GMT
సెట్ లో చెఫ్ లు..వారికి రోజుకి 2 ల‌క్ష‌లు!
X

న‌టీన‌టుల పారితోషికాల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే! సెట్స్ కివెళ్లిన త‌ర్వాత వాళ్ల బాదుడ‌పై నిర్మాత‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదులెన్నో. ముఖ్యంగా హీరోయిన్లు అద‌న‌పు స్టాప్ ని మెయింట‌నెన్స్ ఖ‌ర్చు నిర్మాత‌ల‌కు ఎంత భారంగా మారుతుంద‌న్న‌ది ఎన్నోసార్లు తెర‌పైకి వ‌చ్చింది. వాళ్ల స్టార్ డ‌మ్ ని బ‌ట్టి గొంతెమ్మ కోరిక‌ల కింద న‌లిగిలిపోయిన నిర్మాత‌లెంతో మంది. మ‌రికొంద‌రైతే ఏకంగా స్పెష‌ల్ ప్లైట్ల లో రావ‌డం. వాటి భారాన్ని నిర్మాత‌ల మీద వేయ‌డం. సెట్స్ కి అన‌ద‌నంగా సిబ్బందిని తీసుకు రావ‌డం వాళ్ల జీతాలు కూడా నిర్మాత‌ల‌తో ఇప్పించ‌డం.

ఇలా ఒకటేంటి ఆ సినిమా పూర్తయ్యేలోపు నిర్మాత‌కు చుక్క‌లు క‌నిపిస్తాయి. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో ఈ విధానం బాగా అమ‌లులో ఉంది. తాజాగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ అక్క‌డ తాజా ప‌రిస్థితితుల్ని మ‌రోసారి వెలుగులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేసారు. కొంత మంది న‌టీన‌టుల స‌మంజ‌సం కాని డిమాండ్ చేస్తున్నార‌న్నారు. `షూటింగ్ స‌మ‌యంలో కొంత మంది వ్య‌క్తిగత చెఫ్ ల‌ను తీసుకొస్తున్నారు. వారికి రోజుకి ల‌క్ష రూపాయ‌లు ఇవ్వాలి. మ‌రికొంత మంది రెండు ల‌క్ష‌లు కూడా ఛార్జ్ చేస్తున్నారు.

ఈ ర‌క‌మైన డిమాండ్స్ చాలా హాస్యాస్ప‌దంగా ఉన్నాయి. ఇలాంటి డిమాండ్లు చేస్తున్న‌ది ఎవ‌రు? అన్న‌ది మాత్రం చెప్ప‌ను. త‌మ ఆరోగ్య స‌మ‌స్య‌లు దృష్యా చెఫ్ ల‌ను తీసుకొస్తున్నారు, వారు వండిన వంట మాత్ర‌మే తింటున్నారు. ఇందులో త‌ప్పేం లేదు. ఆరోగ్యం విష‌యంలో ఇలా ఉండొచ్చు. కానీ నిర్మాత ప‌రిస్థితి కూడా అర్ధం చేసుకోవాలి. చేసేది క‌రెక్టేనా? అన్న‌ది కూడా ఆలోచించుకోవాలి. ఈ అద‌న‌పు ఖర్చు చూసి ఇక్క‌డ నిర్మాత ఆరోగ్యం కూడా చెడిపోతుంద‌న్న‌ది గుర్తుంచుకోవాలి.

చివ‌రిగా లెక్క‌లు చూస్తే నిర్మాతకి గుండె పోటు రావ‌డం ఖాయం. కొంత మంది హెయిర్, మ్యాక‌ప్ ఆర్టిస్టుకు రోజుకి 75000 చెల్లిస్తున్నారు. ఇది సాంకేతిక నిపుణుల వేత‌నం కంటే చాలా ఎక్కువ‌. నేను గ‌నుక మ్యాక‌ప్ ఆర్టిస్ట్ ని అయి ఉంటే ధ‌న‌వంతుడిని అయిపోయేవాడిని. దీనికి కార‌ణం న‌టీనటులే కాదు. నిర్మాత‌లు, వారి ఏజెంట్లు వ‌ల్లే త‌ప్పు జ‌రుగుతోంది. కానీ నా సినిమా సెట్స్ లో ఇలాంటి వాటిని స‌హించ‌ను. అవ‌స‌ర‌మైతే సినిమా తీయ‌డం మానేస్తాను త‌ప్ప అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు పెట్టించ‌ను` అని అన్నారు.