'యానిమల్'ను తప్పుగా అర్థం చేసుకున్నాను: అనురాగ్
ప్రస్తుతం చాలా తప్పుగా అర్థం చేసుకున్న, తీర్పు ఇవ్వబడిన .. దూషించబడిన చిత్రనిర్మాత. నా దృష్టిలో అతడు అత్యంత నిజాయితీపరుడు, బలహీనుడు, మనోహరమైన మానవుడు'' అని రాసారు.
By: Tupaki Desk | 16 Jan 2024 4:34 AM GMTసందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్ల మార్కును దాటడంతో 2023లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమాపై తీవ్రమైన క్రిటిసిజం దుమారం రేపింది. హింస, స్త్రీ విద్వేషం, రక్తపాతం వంటి అంశాలను తీవ్రంగా విమర్శించారు. యానిమల్ లో పాజిటివ్ అంశాల కంటే నెగెటివ్ అంశాలపై ఎక్కువగా చర్చించారు. చాలా మంది సెలబ్రిటీలు ఇష్టానుసారం కామెంట్లు చేసారు. కానీ వారంతా యానిమల్ కి ఫ్రీ పబ్లిసిటీలో తమకు తెలియకుండానే సహకరించారు. అసాధారణ విజయం రూపంలో అందరికీ సందీప్ రెడ్డి వంగా జవాబు ఇచ్చాడు.
ఇక సందీప్ రెడ్డి వంగా పైనా అతడి చిత్రంపైనా నోరు జారిన ఫిలింమేకర్స్ లో అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నారు. అయితే యానిమల్ సాధించిన అసాధారణ విజయం నేపథ్యంలో అతడు ఒకటికి రెండు సార్లు సినిమాని చూశాక.. తాను తప్పుగా అర్థం చేసుకున్నానని క్షమాపణ కూడా కోరాడు. అనురాగ్ కశ్యప్ ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో తన సమావేశం నుండి ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. అతడిని అత్యంత తప్పుగా అర్థం చేసుకుని తీర్పు చెప్పారని తనను దూషించారని అంగీకరించారు. సందీప్ అత్యంత నిజాయితీపరుడు.. బలహీనుడు.. మనోహరమైన మానవుడు! అని కూడా కీర్తించాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో సందీప్‌తో ఉన్నప్పటి కొన్ని ఫోటోలను షేర్ చేసి ఇలా రాసాడు. ''సందీప్ వంగాతో ఒక గొప్ప సాయంత్రం గడిపాను. ప్రస్తుతం చాలా తప్పుగా అర్థం చేసుకున్న, తీర్పు ఇవ్వబడిన .. దూషించబడిన చిత్రనిర్మాత. నా దృష్టిలో అతడు అత్యంత నిజాయితీపరుడు, బలహీనుడు, మనోహరమైన మానవుడు'' అని రాసారు.
తాను సందీప్‌ని కలవాలని ఎదురు చూసానని యానిమల్‌ని చూసినప్పటి నుండి సినిమా గురించి ప్రశ్నలు అడగాలనుకున్నానని చెప్పాడు. 2023లో అత్యంత వివాదాస్పదమైన సినిమాల్లో ఒకదాన్ని తాను రెండుసార్లు చూశానని ఒప్పుకున్నాడు. నేను నిజంగా ఎఫ్ ఇవ్వను! అతని గురించి లేదా అతని చిత్రం గురించి ఎవరైనా ఏమనుకుంటున్నారో కానీ నేను ఆ వ్యక్తిని కలవాలనుకున్నాను.. నాకు ప్రశ్నలు ఉన్నాయి.. నేను నిజంగా రెండుసార్లు చూసిన అతడి చిత్రం గురించి నేను అడిగిన ప్రతిదానికీ అతడు సమాధానం ఇచ్చాడు. ఓపికగా ఉన్నందుకు ధన్యవాదాలు. నేను యానిమల్‌ని మొదటిసారి చూసినప్పటి నుండి 40 రోజులు అయింది.. రెండవసారి చూసినప్పటి నుండి 22 రోజులు పూర్తయింది ఇప్పటికి. చాలా కాల తర్వాత హిందీ సినిమా అతిపెద్ద గేమ్ ఛేంజర్ .. దాని ప్రభావాన్ని (మంచి లేదా చెడు) తిరస్కరించలేని చిత్రం. అన్నింటినీ తన దారిలోకి తెచ్చుకునే ఫిలింమేకర్ సందీప్ వంగాతో గొప్ప సాయంత్రం గడిపాను''అని కశ్యప్ అన్నారు.
యానిమల్‌లో రణబీర్, రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రీ, అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించారు. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు వచ్చినా కొన్ని విషయాల్లో విమర్శలు ఎదురయ్యాయి.