Begin typing your search above and press return to search.

అనుష్క 'ఘాటి' - సౌండ్ లేదేంటి?

ఇక కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క, 2023లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.

By:  Tupaki Desk   |   18 March 2025 11:46 AM IST
అనుష్క ఘాటి - సౌండ్ లేదేంటి?
X

సాధారణంగా హీరోయిన్స్ ఒక బిగ్ హిట్ పడితే ఆ తరువాత మరింత స్పీడ్ పెంచుతారు. కానీ అనుష్క బాహుబలి అనంతరం కాస్త స్లో అవ్వడం విశేషం. స్టార్ హీరోల రేంజ్ లో క్రేజ్ ఉన్నా కూడా ఆమె తొందరపడకుండా కంటెంట్ ఉన్న మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. టాలీవుడ్‌లో సూపర్ స్టార్ హీరోయిన్‌గా రాణించిన అనుష్క శెట్టి, తన విభిన్నమైన కథా ఎంపికలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క, 2023లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.

ఇక ఆ తర్వాత ఆమె ప్రకటించని సినిమా, ‘ఘాటి’. ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వేదం’ టాలీవుడ్‌లో ఓ క్లాసిక్ మూవీగా నిలిచింది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో అనుష్క నెవ్వర్ బిఫోర్ రోల్ లో నటించబోతున్నారని, ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ఇక విక్రమ్ ప్రభు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమిళ ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ ప్రభు, ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వనున్నాడు. ఇదిలా ఉండగా, ఈ సినిమా విడుదలపై అనేక రకాల రూమర్లు వస్తున్నాయి. మేకర్స్ ఏప్రిల్ 18న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించినా, ఇప్పటి వరకు ప్రమోషన్లు ప్రారంభించలేదు. దీంతో సినిమా వాయిదా పడే అవకాశముందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

సాధారణంగా అనుష్క సినిమాలకు ప్రీ రిలీజ్ హైప్ ఉండటం సహజం. కానీ ‘ఘాటి’ విషయంలో ఇప్పటి వరకు టీజర్, ఒకట్రెండు పోస్టర్లను మినహా ప్రొమోషన్ల జాడ కనిపించకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలంగా మారాయి. భారీ అంచనాలున్న ఈ సినిమా విడుదల వాయిదా వేస్తారా లేక మేకర్స్ ఒక్కసారిగా ప్రమోషన్లను స్టార్ట్ చేసి అనుకున్న తేదీకే రిలీజ్ చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

క్రిష్ సినిమాలు సాధారణంగా విజువల్‌గా రిచ్‌గా ఉంటాయి. పీరియాడికల్ సినిమాలు, పవర్‌ఫుల్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్‌ను హైలైట్ చేసే విధంగా ఆయన సినిమాలు రూపొందుతాయి. ఇదే ఫార్మాట్‌లో ‘ఘాటి’ కూడా ఉంటుందని భావిస్తున్నారు. క్రిష్ కూడా ఈ సినిమాతో తప్పనిసరిగా స్ట్రాంగ్ హిట్ అందుకోవాల్సిన అవసరం ఉంది. హరిహర వీరమల్లు ఆలస్యం అవుతుండడంతో ఆయన తప్పుకుని మరి ఈ సినిమా స్టార్ట్ చేశారు. మరి సినిమా హడావుడి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.