Begin typing your search above and press return to search.

ఘాటి ఎవరి వల్ల లేట్ అవుతుంది..?

స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఘాటి. ఈ సినిమా విషయంలో అనుష్క ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

By:  Tupaki Desk   |   21 March 2025 4:00 AM IST
ఘాటి ఎవరి వల్ల లేట్ అవుతుంది..?
X

స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఘాటి. ఈ సినిమా విషయంలో అనుష్క ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఘాటి సినిమా కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాలో అనుష్క ఒక పోరాట యోధురాలిగా కనిపించబోతుంది. తనకు అన్యాయం జరిగిన వ్యవస్థ మీద తిరుగుబాటు చేసే పవర్ ఫుల్ రోల్ లో అనుష్క కనిపిస్తుంది.

ఐతే ఈ సినిమాను క్రిష్ చాలా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. అనుష్క ఘాటి సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ లాక్ చేశారు. సమ్మర్ లో అనుష్క సినిమాతో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నారు. ఐతే సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్నా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం అనుష్క ఘాటి సినిమా రిలీజ్ వాయిదా పడినట్టే అంటున్నారు.

అనుష్క పాత్ర.. సినిమాలో విజువల్స్ అన్నీ కూడా స్పెషల్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఐతే అనుష్క సినిమా లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరన్నది తెలియట్లేదు. క్రిష్ అంతకుముందు మొదలు పెట్టిన వీరమల్లు సినిమా కూడా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఆ సినిమా పవన్ కళ్యాణ్ వల్ల లేట్ అవుతుందని అనుకోగా ఇప్పుడు అనుష్క సినిమా విషయంలో కూడా క్రిష్ లేట్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.

క్రిష్ తో అనుష్క ఆల్రెడీ వేదం సినిమా చేశారు. ఆ సినిమాలో అల్లు అర్జున్, మంచు మనోజ్ లు కూడా నటించారు. అనుష్క ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటబోతుందని తెలుస్తుంది. కమర్షియల్ సినిమాలతో పాటు అనుష్క ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా అలరించింది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలతో అదరగొట్టిన అనుష్క ఘాటి సినిమాతో మరోసారి ఆకట్టుకోవాలని చూస్తుంది.

ఏప్రిల్ 18న ఘాటి రిలీజ్ అనుకోగా ఇప్పుడు అది వాయిదా బాట పడుతుండగా మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అన్నది తెలియాల్సి ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం అనుష్క మార్క్ సినిమాగా ఘాటి రాబోతుంది. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడట క్రిష్. మరి సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. అనుష్క ఘాటి ఏ డేట్ కి వచ్చినా కూడా ఆమె ఫ్యాన్స్ మాత్రం సినిమాను సూపర్ హిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.