స్వీటీ కోసం రెండు రెడీ అవుతున్నాయా?
స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ `ఘాటి` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో జరిగిన ఓ యధార్ధ సంఘటనాదారంగా తెరకెక్కిస్తున్నారు.
By: Tupaki Desk | 20 Feb 2025 6:30 AM GMTస్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ `ఘాటి` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో జరిగిన ఓ యధార్ధ సంఘటనాదారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో అనుష్క బాధితురాలి నుంచి నేరస్తురాలిగా మారిన శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. మేజర్ పార్ట్ షూటింగ్ అంతా ఆంధ్రా-ఒడిశా బోర్టర్ అటవీ ప్రాంతంలోనే జరిగింది.
సినిమాకు ఆ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని సమాచారం. అటవీ నేపథ్యంలో సాగే యాక్షన్ , ఛేజింగ్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశాల విషయంలో స్వీటీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నటించింది. రియల్ లొకేషన్స్ లో రియల్ స్టంట్స్ తో అదర గొడుతుందని టీమ్ ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
అన్ని పనులు పూర్తి చేసి ఏప్రిల్ 18న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ సినిమాకి సంబంధించి ఏకంగా రెండు ట్రైలర్లు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒక ట్రైలర్ ను ఈ నెలాఖరున రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ట్రైలర్ కట్ కి సంబంధించిన పనుల్లో క్రిష్ బిజీగా ఉన్నట్లు సమాచారం. అనంతరం రెండవ ట్రైలర్ సినిమా రిలీజ్ కు ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలిసింది.
ఈ సినిమాకి సంబంధించి ఇంకా ప్రచారం పనులు మొదలు కాలేదు. సినిమాలో పాటలు రిలీజ్ కాలేదు. ఫిబ్రవరి ముగింపు దూసుస్తుంది. మార్చి ముందుకొస్తుంది. కానీ ప్రచారం మాత్రం లేదు. ఇప్పటికే సినిమాకి ఎలాంటి బజ్ లేదు. దీంతో ఈ సినిమా ప్రచారం విషయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పూర్తి స్థాయిలో సహకరించాల్సి ఉంటుంది. అనుష్క స్నేహితురాలు కావడంతో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం కాబట్టి ప్రభాస్ నుంచి ఆరకమైన సహకారం ఎప్పుడూ ఉంటుంది.