Begin typing your search above and press return to search.

అనుష్క హారర్ కథ.. ఎంతవరకు వచ్చిందంటే..

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 5:34 AM GMT
అనుష్క హారర్ కథ.. ఎంతవరకు వచ్చిందంటే..
X

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తరువాత చాలా రకాల ఆఫర్స్ విన్నప్పటికి దేనికి ఓకే చెప్పలేదు. బాహుబలి అనంతరం ఆమె చాలా సెలెక్టివ్ గా అడుగులు వేస్తోంది. ఇటీవల మళయాళంలో మొట్టమొదటి సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కింది. జయసూర్య ఈ చిత్రంలో మెయిన్ లీడ్ గా నటించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ‘కథనాల్ - ది వైల్డ్ సోర్సెరర్’ అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కింది. హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ జోనర్ లో రోజిన్ థామస్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది.

శ్రీ గోకుల్ మూవీస్ బ్యానర్ పై గోకుల్ గోపాలన్ ఈ చిత్రాన్ని ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. మలయాళంలో అత్యధిక బడ్జెట్ సినిమాలలో ఇది ఒకటి. రెండు భాగాలుగా ఈ మూవీ కథాంశం ఉంటుందని తెలుస్తోంది. 9వ శతాబ్దంలో క్రైస్తవ మతగురువు కడమత్తత్తు కథనార్ జీవితం ఆధారంగా చేసుకొని ఈ మూవీ కథని పి రామానంద్ రాశారు.

అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయని తెలుస్తోంది. అనుష్క కీలక పాత్రలో నటిస్తూ ఉండటంతో ఈ చిత్రానికి తెలుగు, తమిళ్ భాషలలో కూడా మంచి క్రేజ్ వచ్చింది. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

‘నిశ్శబ్దం’ మూవీ తర్వాత అనుష్క నుంచి పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. ‘బాహుబలి’ సిరీస్ తో అనుష్క కి వచ్చిన క్రేజ్ ‘కథనాల్’ మూవీకి ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అనుష్క ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఘాటీ అనే మూవీ చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ మూవీ కథాంశం ఉంటుందంట. రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.