Begin typing your search above and press return to search.

కొహ్లీ కోసం కెరీర్ నే వ‌దుల‌కుంటుందా?

విరాట్ కోహ్లీ- బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ ప్రేమించుకుని 2017 లో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 March 2025 3:30 PM
కొహ్లీ కోసం కెరీర్ నే వ‌దుల‌కుంటుందా?
X

విరాట్ కోహ్లీ- బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ ప్రేమించుకుని 2017 లో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. ధాంప‌త్య జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఆద‌ర్శ దంప‌తుల్ని చూసి అభిమానులెంతో మురిసిపోతున్నారు. కొహ్లీ అడే ప్ర‌తీ మ్యాచ్ కు అనుష్క త‌ప్ప‌ని స‌రిగా హాజ‌ర వుతుంది. భ‌ర్త‌ను గ్యాల‌రీ నుంచి ప్రోత్స‌హిస్తుంది. బౌండ‌రీలు బాడిన‌ప్పుడ‌ల్లా? విరాట్ వైపు ప్లైయింగ్ కిస్సులు గాల్లో ఎగురుతుంటాయి.

భార్య ప్రేమ‌కు విరాట్ అంతే ఫిదా అవుతాడు. క్రికెట్...అనుష్క‌, పిల్ల‌లు త‌ప్ప విరాట్ కి మ‌రో ప్ర‌పంచం లేదు. అలా విరాట్ కొహ్లీ ఫ్యామిలీతో పాటు తాను కోరుకున్న క్రికెట్ రంగంలోనూ దిగ్విజ‌యంగా దూసు కుపోతున్నాడు. మ‌రి అనుష్క శ‌ర్మ ప్రోఫెష‌న‌ల్ కెరీర్ సంగ‌తి ఏంటి? అంటే? అమ్మ‌డు వృత్తికి పూర్తిగా దూర‌మ‌వుతున్న‌ట్లే క‌నిపిస్తుంది. విరాట్ తో ప్రేమ‌..పెళ్లికి ముందు సినిమాలు బాగానే చేసింది.

వివాహం అనంత‌రం సినిమాల సంఖ్య త‌గ్గింది. పెళ్లి త‌ర్వాత ఏడు సినిమాలే చేసింది. ఇక మూడేళ్ల కాలంగా చూస్తే అనుష్క నుంచి ఒక్క రిలీజ్ కూడా లేదు. చివ‌రిగా 2022లో రిలీజ్ అయిన‌ `క్వాలా` చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత అదే ఏడాది నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయిన `చ‌క్ దే ఎక్స్ ప్రెస్` లో కనిపించింది. అటు పై అనుష్క నుంచి మ‌రో సినిమా లేదు. రెండేళ్ల క్రితం మాత్రం `ది రొమాంటిక్స్` అనే డాక్యుమెంట‌రీలో న‌టించింది.

ఆ త‌ర్వాత అనుష్క క‌నిపించింది ఎక్కువ‌గా విరాట్ ఆడే మ్యాచ్ ల్లోనే. ఇటీవ‌లే ఆస్ట్రేలియాతో జ‌రిగిన సెమీ ఫైన‌ల్స్ లో విరాట్ పెర్పార్మెన్స్ చూసి ఓ రేంజ్ లో సంతోష‌ప‌డింది. మ‌రి కెరీర్ సంగ‌తి ఏంటి? అంటే మాత్రం క్లారిటీ రావ‌డం లేదు. గ్యాప్ ఎందుకు వ‌స్తుంది? కావాల‌నే దూరంగా ఉంటుందా? లేక అవ‌కాశాలు లేక దూరంగా ఉంటుందా? అన్న దానిపై స్ప‌ష్ట‌త రావాలి.