రూ.2 కోట్ల అందం... ఛాంపియన్స్ ట్రోఫీ అనుష్క లుక్ లెక్కలు
దుబాయిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 12 March 2025 2:14 PM ISTదుబాయిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకోవడంతో వన్డే వరల్డ్ కప్ సందర్భంగా పోయిన పరువును నిలబెట్టుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కి టీం ఇండియాకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులు స్టేడియంలో సందడి చేశారు. ముఖ్యంగా మ్యాచ్ గెలిచిన తర్వాత క్రికెటర్స్ సంబరాల్లో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకున్నారు. రోహిత్ శర్మ తన భార్య, పాపతో కలిసి స్టేడియంలో సందడి చేయగా, జడేజా తన ఎమ్మెల్యే భార్య, పాపతో ఫోటోగ్రాఫర్లకు ఫోజ్‌లు ఇచ్చారు. మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవంలో ఫ్యామిలీ మెంబర్స్ ప్రముఖంగా కనిపించారు.
మ్యాచ్ పూర్తి అయి ప్రైజ్ ఇవ్వడానికి ముందు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు కెమెరా కంట పడ్డారు. ఇద్దరి వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. అనుష్కకి విరాట్ బాటిల్ క్యాప్ తీసి ఇచ్చిన వీడియో బాగా వైరల్ అయింది. అంతే కాకుండా ఆ సమయంలో అనుష్క ధరించిన ఔట్ ఫిట్, ఆమె స్టైల్ గురించి కూడా ప్రముఖంగా చర్చ జరిగింది. అనుష్క ధరించిన డ్రస్, ఇతర అలంకరణ వస్తువులు అన్ని కలిపి దాదాపు రూ.2 కోట్ల విలువ చేస్తాయని సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుకుంటున్నారు. అంత ఖరీదైన ఫ్యాషన్ అలంకరణ వస్తువులను కేవలం అక్కడ అనుష్క మాత్రమే ధరించి ఉందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కి హాజరు అయిన సమయంలో అనుష్క ధరించిన మాజే బీడెడ్ డెనిమ్ షర్ట్ రూ.28,356 కాగా, వీవ్డ్ డాట్స్ ఉన్న మాజే షార్ట్స్ రూ.26,439లు. అనుష్క ధరించిన దుస్తుల కంటే ఆమె వేసుకున్న అలంకరణ సామాగ్రి ఎక్కువ రేటు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె ధరించిన రిఫ్లెక్షన్ డి కార్టియన్ బ్రాస్లెట్ ఖరీదు రూ.1.15 కోట్లు. మరో బ్రాస్‌లెట్ ఖరీదు రూ.15.25 లక్షలు. ఆమె చేతిలో కలిగి ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ.1.75 లక్షలు. ఇక ఆమె ధరించిన షూ సింపుల్‌గానే కనిపిస్తున్నా వాటి ఖరీదు ఆన్‌లైన్‌లో ఏకంగా రూ.12,800లుగా చూపిస్తుంది.
మొత్తంగా అనుష్క శర్మ తన ఫ్యాషన్ లుక్ కోసం, ట్రెండీ లుక్ కోసం దాదాపుగా రూ.2 కోట్లను ఖర్చు చేసింది. అంత ఖరీదైన దుస్తులు, అంతటి ఖరీదైన ఆభరణాలు వేసుకున్న కారణంగా అనుష్క మరింత అందంగా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం చాలా సింపుల్‌గా చీర కట్టులో వచ్చిన జడేజా భార్య గురించి మాట్లాడుతున్నారు. మొత్తానికి అనుష్క శర్మ ఎప్పుడు ఏం చేసినా చాలా స్పెషల్ అని దీన్ని బట్టి మరోసారి అర్థం అయింది. ఈమధ్య హీరోయిన్‌గా నటించనప్పటికీ అనుష్క బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తే ఏడాదికి కనీసం రూ.10 కోట్ల ఆదాయం వస్తుంది. కనుక ఆమె ఆ స్థాయిలో ఫ్యాషన్‌గా కనిపించేందుకు ఖర్చు చేయడం తప్పు లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.