పిల్లలు పుట్టాకా స్టార్ హీరోయిన్ల వైరం?
దీపిక, అనుష్క శర్మ మధ్య వైరం ఈనాటిది కాదు. పెళ్లికి ముందు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆ ఇద్దరి మధ్యా పోటీ కొనసాగింది.
By: Tupaki Desk | 19 Dec 2024 3:00 AM GMTఅందంలో ప్రతిభలో ఆ ఇద్దరు టాప్ హీరోయిన్‌లు ఒకరికొకరు తీసిపోరు. ఆ ఇద్దరూ కెరీర్ పరంగా జోరుమీద ఉన్నప్పుడే పెళ్లితో ఓ ఇంటివాళ్లయ్యారు. వారసులకు జన్మనిచ్చారు. అయితే ఆ ఇద్దరి మధ్యా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఇప్పటికీ అలానే ఉంది. పెళ్లయి పిల్లలు పుట్టాకా ఇంకా ఆ వైరం సమసిపోలేదు. ఇంతకీ ఆ ఇద్దరు నాయికలు ఎవరు? అంటే... దీపిక పదుకొనే.. అనుష్క శర్మ. బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా కెరీర్ ని సాగించిన దీపిక పదుకొనే రణవీర్ సింగ్ ని పెళ్లాడి ఇటీవలే ఓ బిడ్డకు తల్లయింది. అనుష్క శర్మ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లాడి ఇద్దరు కిడ్స్ కి మామ్ అయ్యారు.
అయినా ఇప్పటికీ ఆ ఇద్దరి మధ్యా వైరం సమసిపోలేదు. తాజాగా అనుష్క శర్మ పాత వీడియో క్లిప్ ఒకటి అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో దీపిక రేంజులో పరిశ్రమను ఎందుకు షేక్ చేయలేకపోయారు? అని ఇంటర్వ్యూవర్ అడిగినప్పుడు అనుష్క పరోక్షంగా తన శత్రువును విమర్శించింది. మూడు సంవత్సరాలలో మూడు వరుస హిట్‌లను అందించానని, అయితే ఇప్పటికీ తనకు రావాల్సినంత గుర్తింపు రాలేదని అనుష్క గట్టిగా వాదించింది. తన ప్రతిభను బట్టి తనకు గుర్తింపు వచ్చిందని, వివాదాలు లేదా ఫ్యాషన్ ఎంపికల నుండి కాదని వ్యాఖ్యానించింది.
దీపిక, అనుష్క శర్మ మధ్య వైరం ఈనాటిది కాదు. పెళ్లికి ముందు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆ ఇద్దరి మధ్యా పోటీ కొనసాగింది. దాంతో పాటు రణవీర్ సింగ్ తన నుంచి దూరమవ్వడానికి దీపిక కారణమని అనుష్క శర్మ భావించింది. బ్యాండ్ బాజా బారాత్ (2010) సినిమాలో అనుష్క-రణవీర్ జంటగా నటించారు. ఆ సినిమా సమయంలోనే ఈ జంట డేటింగ్ చేసారు. కానీ ఆ తర్వాత రణవీర్ లైఫ్‌లోకి దీపిక ఎంటరైంది. చివరికి అతడు దీపికతో ప్రేమాయణం ప్రారంభించి అనుష్కను వదిలిపెట్టాడు. ఆ కోపం ఇప్పటికీ అనుష్క శర్మలో అలానే ఉండిపోయిందని, అందుకే ఇంతకాలం అయినా మర్చిపోలేకపోతోందని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.