Begin typing your search above and press return to search.

అనుష్క ఘాటి ప్రమోషన్స్ కి లేటేంటి..?

ఇక ఫైనల్ గా స్వీటీ అనుష్క క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఘాటి సినిమా డిఫరెంట్ కథతో వస్తుంది.

By:  Tupaki Desk   |   9 March 2025 7:00 AM IST
అనుష్క ఘాటి ప్రమోషన్స్ కి లేటేంటి..?
X

స్వీటీ అనుష్క ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో ఘాటి సినిమా చేస్తుంది. 2020 నిశ్శబ్దం సినిమా చేసిన అనుష్క ఆ తర్వాత మూడేళ్లు టైం తీసుకుని 2023 లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది. ఫ్యాన్స్ తనని మిస్ అవుతున్నారని తెలిసినా సరైన కథ దొరకట్లేదని అమ్మడు వెయిట్ చేసింది. ఇక ఫైనల్ గా స్వీటీ అనుష్క క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఘాటి సినిమా డిఫరెంట్ కథతో వస్తుంది.

సినిమాలో ఆమెది చాలా పవర్ ఫుల్ రోల్ అని తెలుస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన టీజర్ ఇంప్రెస్ చేయగా త్వరలో మరో ప్రమోషనల్ వీడియోని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ లాక్ చేశారు. సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసిన ఘాటి సినిమా ప్రమోషన్స్ ని ఇంకా మొదలు పెట్టలేదు. అనుష్క సినిమా అంటే ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఐతే ఘాటి రిలీజ్ నెక్స్ట్ మంత్ ఉన్నా కూడా ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.

ఇంతకీ సినిమా అనుకున్న టైం కి వస్తుందా ఇది కూడా లేట్ అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. అనుష్క నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న ఫిమేల్ సెంట్రిక్ సినిమా కాబట్టి ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ ఉంది. అంతకుముందు అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలతో అలరించిన అనుష్క ఘాటితో కూడా మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది.

క్రిష్ ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కించారని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఘాటి ఎలా ఉంటుందో శాంపిల్ చూపించగా సినిమా స్వీటీ ఫ్యాన్స్ కి సూపర్ జోష్ అందిస్తుందని అంటున్నారు. అనుష్క ని స్క్రీన్ మీద మిస్ అవుతున్న ఆడియన్స్ అందరికీ ఘాటి ఫుల్ మీల్స్ పెట్టేస్తుందని అంటున్నారు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ఘాటి సినిమా ప్రమోషన్స్ మొదలు పెడితే కానీ అనుష్క ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అవుతుందని చెప్పొచ్చు. అనుష్క మాత్రం ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. క్రిష్ డైరెక్షన్ లో ఆల్రెడీ వేదం సినిమాలో నటించిన అనుష్క ఈ ఘాటితో మరోసారి తన టాలెంట్ ఏంటో చూపిస్తుందని చెబుతున్నారు.