అడవిలో అనుష్క పోరాటాలు అదిరిపోయేలా!
స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ వాస్తవ సంఘటనలు ఆధారంగా `ఘాటీ` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Feb 2025 7:30 AM GMTస్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ వాస్తవ సంఘటనలు ఆధారంగా `ఘాటీ` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో జరిగిన ఓయధార్ధ సంఘటనాదారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో అనుష్క బాధితురాలి నుంచి నేరస్తురాలిగా మారిన శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఈ కథలో గంజాయి అక్రమ రావణా నేపథ్యం కూడా హైలైట్ అవుతుందిట.
ఆంధ్రా-ఒడిశా బోర్టర్ అటవీ ప్రాంతంలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని సమాచారం. దీనిలో భాగంగా అటవీ నేపథ్యంలో సాగే యాక్షన్ , ఛేజింగ్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాల విషయంలో స్వీటీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నటించిందిట. రియల్ లొకేషన్స్ లో రియల్ స్టంట్స్ తో అదర గొడుతుందని సమాచారం. ఈ సన్నివేశాలకు సంబంధించి అనుష్క ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుందిట.
ఈ సన్నివేశాల చిత్రీకరణ కు క్రిష్ డూప్ ఫైటర్లను తీసుకుందామంటే? అనుష్క నో చెప్పిందిట. తానే స్వయంగా ఆయా సన్నివేశాల్లో నటిస్తానని చెప్పడంతో ఎలాంటి డూప్ లేకుండా వాటి చిత్రీకరణ పూర్తిచేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మరికొన్నిసన్నివేశాలు మావోయిస్టుల అడ్డా ప్రాంతమైన దంతెవాడ అటవీ ప్రాంతంలోనూ కొన్నికీలకసన్నివేశాలు చిత్రీకరించారుట. దంతెవాడ అంటే నక్సలైట్ల ప్రాబల్యం గల ప్రాంతం.
అలాంటి చోట షూటింగ్ అంటే ? చిన్న విషయం కాదు. కత్తి మీద సాములాంటి వ్యవహారమే. అయినా చిత్రీకరణ విషయంలో క్రిష్ - అనుష్క ఎక్కడా రాజీ పకుండా రిస్క్ లొకేషన్లలో సైతం షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా నిర్మాణానంతర పనుల్లో ఉంది. అన్నిపనులు పూర్తి చేసి ఏప్రిల్ 18న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.