ఘాటీ రిలీజ్ డేట్ పై నిర్మాతల క్లారిటీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తను స్క్రీన్ పై కనిపిస్తే చాలనుకునే ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకి.
By: Tupaki Desk | 18 Feb 2025 5:54 AM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తను స్క్రీన్ పై కనిపిస్తే చాలనుకునే ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకి. బాహుబలి తర్వాత తన రేంజ్ ఎక్కడికో వెళ్తుందనుకుంటే అమ్మడు మాత్రం అందరికీ భిన్నంగా సినిమాలు చేయడం తగ్గించేసింది. బాహుబలి2 తర్వాత అనుష్క నుంచి చాలా తక్కువ సినిమాలే వచ్చాయి.
ఎంతో గ్యాప్ తీసుకుని నవీన్ పోలిశెట్టితో కలిసి 2023లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను చేసిన అనుష్క ఆ సినిమాతో మంచి హిట్ అందుకుంది. మొదట్లో నవీన్ తో సినిమా ఏంటనుకున్నారు కానీ ఆ మూవీలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ, కథ అన్నీ బాగా కుదిరి సినిమా మంచి విజయం సాధించింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి హిట్ అయింది ఇకనైనా అనుష్క వరుస సినిమాలు చేస్తుందనుకున్నారు ఫ్యాన్స్.
కానీ ఆ మూవీ రిలీజై ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ అనుష్క నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం అనుష్క చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి మలయాళ మూవీ కథనర్ ఒకటి కాగా, రెండోది క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘాటి మరొకటి. ఘాటి సినిమాలో అనుష్క లీడ్ రోల్ లో నటిస్తోంది.
క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ ఘాటీపై అంచనాలను పెంచేశాయి. ఈ మూవీని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్న మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ చెప్పిన టైమ్ కు సినిమా వస్తుందా లేదా అని అందరికీ ఘాటీ రిలీజ్ డేట్ పై అనుమానాలున్నాయి.
ఈ నేపథ్యంలో ఘాటీ రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ వర్గాలు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఘాటీని ఏప్రిల్ 18న రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాటు జరుగుతున్నాయని, దాని ప్రకారమే చిత్ర యూనిట్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో ఘాటీ ఏప్రిల్ 18నే రిలీజ్ అవుతుందని చిత్ర బృందం తెలపడంతో ఘాటీ రిలీజ్ పై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి.