Begin typing your search above and press return to search.

స్వీటీ అనుష్క స్ట‌న్నింగ్ మేకోవ‌ర్

ఇటీవ‌లే విడుద‌లైన ఘాటి గ్లింప్స్ ఆక‌ట్టుకుంది. ఇందులో ఊచ కోత కోసే అంద‌మైన ప‌ల్లెటూరి అమ్మాయిగా అనుష్క న‌టిస్తోంది.

By:  Tupaki Desk   |   23 Feb 2025 11:24 AM GMT
స్వీటీ అనుష్క స్ట‌న్నింగ్ మేకోవ‌ర్
X

స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి పరిచయం అవ‌స‌రం లేదు. అరుంధ‌తి, భాగ‌మ‌తి, బాహుబ‌లి 1, 2 చిత్రాల్లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న అనుష్క‌కు బాష‌తో సంబంధం లేకుండా అన్నిచోట్లా అభిమానులు ఉన్నారు. ఈ బ్యూటీ చివ‌రిగా `మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి` అనే చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత ఘాటి అనే థ్రిల్ల‌ర్ చిత్రంలోను న‌టిస్తూ బిజీగా ఉంది.


ఇటీవ‌లే విడుద‌లైన ఘాటి గ్లింప్స్ ఆక‌ట్టుకుంది. ఇందులో ఊచ కోత కోసే అంద‌మైన ప‌ల్లెటూరి అమ్మాయిగా అనుష్క న‌టిస్తోంది. అనుష్క గిరిజన యువ‌తిగా న‌టించింది. శ‌త్రువుల పీక‌లు కోసేంత ధైర్యవంతురాలైన యువ‌తిగా అనుష్క‌ న‌టిస్తోంద‌ని పోస్ట‌ర్లు టీజ‌ర్ వెల్ల‌డించాయి.


ఘాటి చిత్రంలో మునుప‌టిలా స్మార్ట్ లుక్ తో క‌నిపిస్తోంది. అదే రూపంతో ఇప్పుడు అనుష్క ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా అనుష్క స‌రికొత్త మేకోవ‌ర్ కి సంబంధించిన ఫోటోలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్వీటీ శెట్టి ఎంతో సింపుల్ గా క‌నిపిస్తున్నా యూత్ హృద‌యాల్లో గిలిగింత‌లు పెడుతోంది. జేజ‌మ్మ ఎంతో ముచ్చ‌టగా క‌నిపిస్తోంది. సింపుల్ పంజాబీ దుస్తుల్లో అంద‌మైన ఎక్స్ ప్రెష‌న్స్, స్మైలీ లుక్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ముఖ్యంగా స్వీటీ ఫేస్ లో న‌వ్వు, ఆ నుదిటిన తిల‌కం బొట్టుతో ఎంతో బ్యూటిఫుల్ గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ కొత్త లుక్ యూత్ సామాజిక మాధ్య‌మాల్లోకి దూసుకెళుతోంది.