Begin typing your search above and press return to search.

బీసీసీఐకి కోటింగ్.. కోహ్లీ అలా అనుష్క ఇలా!

టీమిండియా పర్యటనల సమయంలో బీసీసీఐ విధించిన కొత్త ఫ్యామిలీ టైమ్ రూల్‌ను విరాట్ కోహ్లీ విమర్శించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 March 2025 8:22 PM IST
బీసీసీఐకి కోటింగ్.. కోహ్లీ అలా అనుష్క ఇలా!
X

టీమిండియా పర్యటనల సమయంలో బీసీసీఐ విధించిన కొత్త ఫ్యామిలీ టైమ్ రూల్‌ను విరాట్ కోహ్లీ విమర్శించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అనుష్క శర్మ త‌న భ‌ర్త‌కు మ‌ద్ధ‌తుగా ఇన్‌స్టాలో చేసిన‌ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. వృత్తిపరమైన ఒత్తిళ్ల మధ్య ఆటగాళ్ల మానసిక శ్రేయస్సు కోసం కుటుంబ మద్దతు ప్రాముఖ్యతను కోహ్లీ నొక్కి చెప్పారు. దానికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చే నిగూఢ‌మైన పోస్ట్ తో అనుష్క శ‌ర్మ అండ‌గా నిలిచారు.

కుటుంబం వేరు.. స‌హ‌చ‌రులు, క‌లిసి ప‌ని చేసే ఇత‌ర ఉద్యోగులు వేరు! అనే అర్థం వ‌చ్చేలా అనుష్క వివ‌ర‌ణాత్మ‌క పోస్ట్ ని షేర్ చేసారు. బీసీసీఐ కొత్త నిబంధనను అనుష్క శ‌ర్మ‌ భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీ బహిరంగంగా విమర్శించిన కొద్దిసేపటికే ఆమె పోస్ట్ వేగంగా దూసుకెళ్లింది. ఈ పోస్ట్ లో అమ్మ నాన్న తోబుట్టువులు వేరు... స‌హోద్యోగులు పొరుగువారు లేదా స్నేహితులు వేరు.. మీ క‌ష్టాన్ని గుర్తించేది కుటుంబం అని అనుష్క శ‌ర్మ త‌న నోట్ లో రాసారు. మీ గురించి తెలిసిన ప్ర‌తి ఒక్కరి మనస్సులలో మీ భిన్నమైన వెర్షన్ ఉంది. మీరు మీరే అని భావించే వ్యక్తి మీ కోసం మాత్రమే ఉంటాడు. అది ఎవరో మీకు నిజంగా తెలియదు`` అనే క్రిప్టిక్ వ్యాఖ్య‌తోను అనుష్క శ‌ర్మ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్ సందర్భంగా కోహ్లీ చేసిన ఘాటైన వ్యాఖ్యల తర్వాత అనుష్క పోస్ట్ ఇంట‌ర్నెట్ లో వేగంగా వైర‌ల్ అయింది.

పర్యటనల సమయంలో కుటుంబ సమయాన్ని పరిమితం చేసే బీసీసీఐ కొత్త విధానాన్ని కోహ్లీ విమర్శిస్తూ తన నిరాశను వ్యక్తం చేశాడు. ప్రొఫెషనల్ క్రికెట్ లో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఆటగాళ్లకు కుటుంబ మద్దతు ఎంత కీలకమో అత‌డు గ‌ట్టిగా చెప్పారు. బయట ఏదైనా సీరియ‌స్ సంఘటన జరిగిన ప్రతిసారీ కుటుంబం ద‌గ్గ‌ర‌కు రావడం ఎంత నిరుత్సాహకరమైనదో ప్రజలకు వివరించడం చాలా కష్టం అని కోహ్లీ అన్నారు. కుటుంబం విలువ ఏమిటో జ‌నాల‌కు అర్థం కావడం లేదని నేను అనుకుంటున్నాను. దాని గురించి నేను చాలా నిరాశ చెందుతున్నాను. బహుశా ఇలాంటి నియమాలను రూపొందించే వారిని దూరంగా ఉంచాలి... అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

క్రికెట్ పర్యటనల సమయంలో అనుష్క, త‌న పిల్లలతో క‌లిసి కోహ్లీ ఆడుతున్న మ్యాచ్ ల‌కు హాజ‌ర‌వుతున్నారు. అందుకే ఆటగాళ్ల మానసిక ఉప‌శ‌మ‌నానికి ఫ్యామిలీ ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం ఎంత‌ ముఖ్యమో నిర్ణయాధికారులు గ్రహించకపోవచ్చునని కోహ్లీ, అనుష్క నేరుగా సూచించారు. అనుష్క పోస్ట్ బీసీసీఐ వివాదాన్ని నేరుగా ప్రస్తావించనప్పటికీ, పోస్ట్ చేసిన టైమింగ్ తో ఇది ఎవ‌రిని ఉద్ధేశించిన‌దో ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నారు.