అనుష్క కోసం బాగా ట్రై చేస్తున్నారా..?
స్వీటీ అనుష్క సౌత్ లో తనకు ఎంత క్రేజ్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేయడానికి ఆసక్తి చూపించదు.
By: Tupaki Desk | 14 Jun 2024 5:20 AM GMTస్వీటీ అనుష్క సౌత్ లో తనకు ఎంత క్రేజ్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేయడానికి ఆసక్తి చూపించదు. అనుష్క సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ అంతా కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తుంటారు. నిశ్శబ్ధం సినిమా తర్వాత 3, 4 ఏళ్లు గ్యాప్ తీసుకున్న అనుష్క లాస్ట్ ఇయర్ నవీన్ పొలిశెట్టి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తో సక్సెస్ అందుకున్న అమ్మడు వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది.
ఇప్పటికే క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న అనుష్క మలయాళంలో కూడా ఒక క్రేజీ ఆఫర్ అందుకుంది. ఈ రెండు సినిమాలను పూర్తి చేశాక తర్వాత సినిమాల గురించి ఆలోచిస్తా అంటుందట. ఐతే ఈలోగా తెలుగులో ఒక భారీ సినిమా ఆఫర్ అనుష్కని పలకరించిందని తెలుస్తుంది. పాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేస్తున్న ఆ సినిమాలో అనుష్కని నటింపచేయాలని మేకర్స్ బాగా ట్రై చేస్తున్నారట.
ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బాగుంటుందని.. ఆ పాత్రకు అనుష్క ఐతే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు. అనుష్క ఆ రోల్ కి ఓకే చేస్తే ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధం అంటున్నారట. అనుష్క మాత్రం డైరెక్టర్ చెప్పిన కథ వినడానికి కూడా అంతగా ఆసక్తి చూపించట్లేదని టాక్. తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ వచ్చాక కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంపిక చేసుకోవాలని చూస్తుంది అనుష్క.
అందుకే సాధ్యమైనంత వరకు కమర్షియల్ సినిమాలకు నో చెప్పాలనే అనుకుంటుందట. అనుష్క యెస్ అంటే మాత్రం ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని భావిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏంటి ఆ డైరెక్టర్ ఎవరు హీరో ఎవరిని ఎంపిక చేశారన్నది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం అనుష్క చేస్తున్న తెలుగు సినిమా ఘాటిని కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అనుష్క ఫ్యాన్స్ అందరు కూడా ఆ సినిమా కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అనుష్క మాత్రం ఫిమేల్ సెంట్రిక్ సినిమాల మీదే గురి పెట్టుకుని ఉందని తెలుస్తుంది. అందుకే కమర్షియల్ సినిమాల ఛాన్సులు వస్తున్నా కాదనేస్తుందని అంటున్నారు. స్వీటీ ఫ్యాన్స్ మాత్రం స్టార్ హీరోలతో కూడా ఆమె జత కట్టాలని కోరుతున్నారు. ఐతే స్టార్ సినిమా అయినా హీరోయిన్ పాత్రకు వెయిట్ ఉంటే తప్పకుండా చేస్తా అంటుందట అనుష్క.