Begin typing your search above and press return to search.

సైలెంట్ గా అగ్ర హీరోలతోనే అనుష్క ప్రమోషన్స్!

ఇక ప్రభాస్ పేరును కూడా ఆమె బాగానే వైరల్ అయ్యేలా చేస్తోంది. ఏదైనాప్పటికీ స్టార్ హీరోల చేత ఇప్పుడు ఆమె సైలెంట్ గా సినిమాను ప్రమోట్ చేయించుకునే విధంగా ప్లాన్ వేయడం విశేషం.

By:  Tupaki Desk   |   6 Sep 2023 4:06 PM GMT
సైలెంట్ గా అగ్ర హీరోలతోనే అనుష్క ప్రమోషన్స్!
X

బాహుబలి సినిమా తర్వాత ఆ సినిమాలో నటించిన నటీనటులు అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా ఇండస్ట్రీలో గ్యాప్ లేకుండా సినిమా అవకాశాలు అందుకుంటూ వెళుతున్నారు. అయితే ల్ అనుష్క మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిశ్శబ్దం సినిమా తర్వాత ఆమె ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం, వచ్చిన ఆఫర్స్ ను కూడా ఆమె రిజెక్ట్ చేస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

వీలైనంత ఎక్కువగా తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఆమె ఇష్టపడుతోంది. అలాగే తన ఫోటోలు కూడా బయట లీక్ కాకుండా ప్రైవసీని మెయింటైన్ చేస్తోంది. అయితే అనుష్క తనకు కంటెంట్ ఎంతో నచ్చితే గాని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం లేదు. ఇక మొత్తానికి ఇప్పుడు నవీన్ పోలీస్ శెట్టితో చేసిన మిస్ షట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా శుక్రవారం రోజు విడుదల కాబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆమె పాల్గొనలేదు. కేవలం ఫోన్ ద్వారానే కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆమె సోషల్ మీడియాలో ఛాలెంజ్ లు విసురుతూ సినిమాకు ప్రమోషన్స్ పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇక ప్రభాస్ పేరును కూడా ఆమె బాగానే వైరల్ అయ్యేలా చేస్తోంది. ఏదైనాప్పటికీ స్టార్ హీరోల చేత ఇప్పుడు ఆమె సైలెంట్ గా సినిమాను ప్రమోట్ చేయించుకునే విధంగా ప్లాన్ వేయడం విశేషం.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అనుష్క రెసిపీ ఛాలెంజ్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్కు తనకు ఇష్టమైన వంటకాన్ని చేసి చూపించాలని ఛాలెంజ్ చేయగా ఇప్పుడు ప్రభాస్ కూడా అదే తరహాలో ఫాలో అవుతున్నాడు. రామ్ చరణ్ కు కూడా ఛాలెంజ్ విసిరాడు. ఇక రామ్ చరణ్ కూడా అదే కంటిన్యూ చేస్తూ తనకు నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఇష్టం అని దాని తయారీ విధానం అన్ని తెలుపుతూ రానా దగ్గుపాటికి ఛాలెంజ్ విసిరాడు.

ఇక రానా కూడా ఆ ఛాలెంజ్ ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి అతను మరొకరికి ఇంకా ఎలాంటి ఛాలెంజ్ విసురుతాడో చూడాలి. మొత్తానికి అనుష్క శెట్టి తన సినిమాకు ప్రమోషన్స్ క్రియేట్ అయ్యే విధంగా అగ్రతారాలను బాగానే లైన్లో పెట్టినట్లుగా అనిపిస్తుంది. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.