Begin typing your search above and press return to search.

మేమేకాదు..మా అమ్మ‌ల్ని స్నేహితుల్ని చేసాం!

బాలీవుడ్ న‌టులు- క్రికెట్ ప్లేయ‌ర్స్ మ‌ధ్య ఉన్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు.

By:  Tupaki Desk   |   30 July 2024 6:25 AM GMT
మేమేకాదు..మా అమ్మ‌ల్ని స్నేహితుల్ని చేసాం!
X

బాలీవుడ్ న‌టులు- క్రికెట్ ప్లేయ‌ర్స్ మ‌ధ్య ఉన్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. ఆ రెండు రంగాల మ‌ధ్య ఎంతో అనుబంధం ఉంది. బాలీవుడ్ భామ‌లు క్రికెట‌ర్ల‌ను ప్రేమించి పెళ్లాడ‌టం, డేటింగ్ వ్య‌వ‌హారా లు.. ప్రెండ్ షిప్ ఇలా వాళ్ల మ‌ధ్య బంధం కొన‌సాగుతుంది. తాజాగా అనుష్క శ‌ర్మ‌- ధోనీ వైప్ సాక్షి మంచి స్నేహితులు అన్న సంగ‌తి వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్నిస్వ‌యంగా అనుష్క రివీల్ చేసింది.


`సాక్షి నేను అస్సాంలోని మార్గ‌రీటాలో ఉన్న సెయింట్ మేరీస్ స్కూల్లో చ‌దువుకున్నాం. సాక్షి ది అస్సాంలోని టిన్సు కియా. మాది అయోధ్య‌. మా నాన్న‌లిద్ద‌రు ఉద్యోగాల రీత్యా మార్గ‌రీటాలో ఉండేవారు. స్కూల్కి వెళ్లిన మొద‌టి రోజు సాక్షి ప‌క్క‌నే కూర్చున్నా. మొద‌టి రోజే నాతో చాలా బాగా మాట్లాడింది. దీంతో ప్ర‌తీ రోజు ఆమె ప‌క్క‌నే కూర్చోవ‌డం మొద‌లు పెట్టాను. హోమ్ వ‌ర్క్ విష‌యంలో ఎలాంటి సందేహం వ‌చ్చినా త‌న‌నే అడిగేదాన్ని.

మా ఇద్ద‌రి కార‌ణంగా క్రమంగా మా అమ్మ‌లు కూడా స్నేహితుల‌య్యారు. ఆర‌వ త‌ర‌గ‌తిలో మ‌ళ్లీ నాన్న‌కి ట్రాన్స‌ప‌ర్ అవ్వ‌డంతో మేము మ‌రో ప్రాంతానికి వెళ్లిపోయాం. ఆ త‌ర్వాత పెరిగి పెద్ద‌వ‌డం ఎవ‌రి వృత్తులో వారు స్థిర ప‌డ‌టం జ‌రిగింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌ల‌సుకున్నాం` అని అంది. సాక్షి ధోనీకి చిన్న నాటి స్నేహితురాలు అన్న సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో ధోనీ-ఇద్ద‌రు ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు.

అనుష్క‌ కూడా విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలా చిన్న నాటి స్నేహితురాళ్లు ఇద్ద‌రు కూడా మంచి క్రికెట్ ఆట‌గాళ్ల‌నే వివాహం చేసుకుని స్థిర‌ప‌డ్డారు. సాక్షి హోమ్ మేక‌ర్ అయినా అనుష్క మాత్రం బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ గా ఎదిగింది. అమ్మ‌డు మోడ‌లింగ్ నుంచి సినిమా రంగం వైపు వ‌చ్చి వృత్తి ప‌రంగా స్థిర‌ప‌డింది.