Begin typing your search above and press return to search.

అనుష్క శెట్టికి అరుదైన స‌మ‌స్య‌

అప్ప‌టిక‌ప్పుడు నాన్ స్టాప్‌గా కొన్ని నిమిషాల పాటు న‌వ్వు ఆపుకోలేక‌పోవ‌డం త‌న స‌మ‌స్య‌. ఒక పాత వీడియో ఇంటర్వ్యూలో అనుష్క‌ శెట్టి ఈ ప్రాబ్లెమ్ గురించి వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 7:04 AM GMT
అనుష్క శెట్టికి అరుదైన స‌మ‌స్య‌
X

త‌న‌కు కొన్ని నిమిషాల పాటు ఆగ‌కుండా న‌వ్వే అరుదైన స‌మ‌స్య ఉంద‌ని స్వీటీ అనుష్క శెట్టి వెల్ల‌డించిన ఒక ఇంట‌ర్వ్యూ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఆహ్లాద‌క‌రంగా క‌నిపించే అనుష్క శెట్టికి ఇలాంటి స‌మ‌స్య‌ ఉందా? అని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఇది సెట్లో కొంద‌రికి తెలిసిన విష‌య‌మే అయినా.. చాలా మంది ప్ర‌జ‌ల‌కు దీనిపై అవేర్ నెస్ లేదు. అస‌లింత‌కీ సౌతిండియా సూప‌ర్ స్టార్ అనుష్క శెట్టి స‌మ‌స్య ఏమిటి? అంటే ..

అప్ప‌టిక‌ప్పుడు నాన్ స్టాప్‌గా కొన్ని నిమిషాల పాటు న‌వ్వు ఆపుకోలేక‌పోవ‌డం త‌న స‌మ‌స్య‌. ఒక పాత వీడియో ఇంటర్వ్యూలో అనుష్క‌ శెట్టి ఈ ప్రాబ్లెమ్ గురించి వెల్ల‌డించారు. తాను న‌వ్వ‌డం ప్రారంభించిన తర్వాత ఆపడం అసాధ్యమని తెలిపారు. అనుష్క మాట్లాడుతూ- 'నాకు నవ్వే వ్యాధి ఉంది. నవ్వడం సమస్యేనా? అని అంద‌రూ ఆశ్చర్యపోవచ్చు. నేను నవ్వడం ప్రారంభిస్తే, 15 నుండి 20 నిమిషాలు ఆప‌లేను. కామెడీ సన్నివేశాలను చూస్తున్నప్పుడు లేదా షూటింగ్ చేస్తున్నప్పుడు ప‌డి ప‌డి న‌వ్వుతూ నేను అక్షరాలా నేలపై పడిపోతాను. దానివ‌ల్ల‌ షూటింగ్ చాలాసార్లు ఆగిపోయింది'అని గ‌తంలో వెల్ల‌డించారు.

ఈ పరిస్థితిని ఏమ‌ని అంటారు? చాలామంది లాఫింగ్ డిసీజ్ అని పిలుస్తున్నా.. వైద్య ప‌రిభాష‌లో 'సూడోబుల్బార్ ఎఫెక్ట్ అని పిలుస్తారని న్యూరాలజిస్ట్ డాక్టర్లు చెబుతున్నారు. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు.. చాలా నిమిషాలు (సాధారణంగా 15-20 నిమిషాలు) అలా న‌వ్వుతూనే ఉంటారట‌. స‌మంత‌ మ‌యోసైటిస్ గురించి, ఫ‌హ‌ద్ ఫాజిల్ హైప‌ర్ యాక్టివ్ డిజార్డ‌ర్ గురించి ఇంత‌కుముందు బ‌హిరంగంగా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే .. అనుష్క శెట్టి హారర్ చిత్రం 'కథనార్- ది వైల్డ్ సోర్సెరర్‌'తో మలయాళంలోకి అడుగుపెడుతోంది. ఈ వార్తను దర్శకుడు రోజిన్ థామస్ మార్చి 2024లో ధృవీకరించారు. 9వ శతాబ్దానికి చెందిన మంత్రముగ్ధులను చేసే ప్రఖ్యాత పూజారి కడమత్తత్తు కథనార్ జీవితం ఆధారంగా 'కథనార్' కథను రాసుకున్నారు. ఈ చిత్రంలో జయసూర్య కథానాయకుడిగా నటిస్తున్నారు. శ్రీగోకులం మూవీస్ గోకులం గోపాలన్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ హారర్-థ్రిల్లర్ చిత్రాన్ని మలయాళం, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ, బెంగాలీ, కన్నడ భాషలలో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.