Begin typing your search above and press return to search.

సడన్ గా ఈ ఫొటో ఏంటి అనుష్క?

సడెన్ గా అనుష్క దేవసేన స్టిల్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడానికి కారణం ఏంటనేది మాత్రం ఎవ్వరికి అంతుచిక్కడం లేదు.

By:  Tupaki Desk   |   30 July 2024 4:23 AM GMT
సడన్ గా ఈ ఫొటో ఏంటి అనుష్క?
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండదు. అప్పుడప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. అయితే లేటెస్ట్ ఫోటోలని మాత్రం ఆమె పెద్దగా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోదు. కేవలం తన మనసుకి నచ్చిన ఫోటోలని మాత్రమే షేర్ చేయడానికి ఇన్ స్టాగ్రామ్ వాడుతుంది. అయిన కూడా ఆమెని 6.9 మిలియన్స్ మంది ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండటం విశేషం.

ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఒక పాన్ ఇండియా మూవీ చేస్తోంది. తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అందుకుంది. ఆ సమయంలో కూడా ఈ బ్యూటీ మీడియా ముందుకి రావడానికి ఇంటరెస్ట్ చూపించలేదు. ప్రస్తుతం సినిమాలు సెట్స్ పైన ఉన్న కూడా మీడియా కంటికి చిక్కడం లేదు.

బాహుబలి సిరీస్ తర్వాత అనుష్కని ఒరిజినల్ లుక్ ని పబ్లిక్ చూసింది చాలా తక్కువ సార్లు అని చెప్పొచ్చు. స్టార్ హీరోయిన్ గా ఉన్న కూడా ఫేమ్ కి దూరంగా ఆమె సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడుతుందని అనుష్క ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క బాహుబలి సినిమాలోనే దేవసేన స్టిల్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బాణం, విల్లు పట్టుకొని వీరనారిగా రెడ్ కలర్ శారీలో ఉన్న ఈ స్టిల్ కి ఏకంగా 1.93 లక్షల మంది లైక్స్ రావడం విశేషం.

సడెన్ గా అనుష్క దేవసేన స్టిల్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడానికి కారణం ఏంటనేది మాత్రం ఎవ్వరికి అంతుచిక్కడం లేదు. అయితే అనుష్క ఫ్యాన్స్, డార్లింగ్ ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ ఫోటోపై డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. బాహుబలి 3 అప్డేట్ అంటూ కొంతమంది కామెంట్స్ చేశారు. డార్లింగ్ ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇందులో ప్రభాస్ రెడ్ కలర్ షూట్ వేసుకున్నారు. అందుకే సింబాలిక్ గా అనుష్క కూడా రెడ్ కలర్ శారీ ఫోటోని షేర్ చేసిందని ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ మీద ఉన్న లవ్ ని అనుష్క ఈ ఫోటోతో ఎక్స్ ప్రెస్ చేసిందని కూడా పోస్టులు పెడుతున్నారు. కొంతమంది అయితే ప్రభాస్ తో పెళ్లిపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వాలని అనుష్కకి రిక్వెస్ట్ లు పెడుతూ ఉండటం విశేషం.