Begin typing your search above and press return to search.

అనుష్క శెట్టి.. మరో క్రేజీ ప్రాజెక్ట్

కథలో కీలకపాత్రలోనే అనుష్క శెట్టి కనిపించబోతోందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా దీనిని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు

By:  Tupaki Desk   |   1 Sep 2023 4:06 AM GMT
అనుష్క శెట్టి.. మరో క్రేజీ ప్రాజెక్ట్
X

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ అనుష్క. ఈ బ్యూటీ నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతానికి సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఉంది. కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ కూడా ఆశిస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత అనుష్క మరి సినిమాలు చేసే అవకాశం లేదనే ప్రచారం జోరుగా సాగింది. గత కొంతకాలంగా ఆమె మీడియా కంటికి కనిపించలేదు. దీంతో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో వాస్తవం లేదని తాజాగా క్లారిటీ వచ్చింది. అనుష్క శెట్టి మలయాళంలోకి నటిగా అడుగుపెడుతోంది.

ఆమె హీరోయిన్ గా నటిస్తోన్న మలయాళీ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయ్యింది. జయసూర్య హీరోగా కథనార్ టైటిల్ తో పీరియాడికల్ ఫిక్షనల్ యాక్షన్ అండ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అనుష్క శెట్టి కూడా నటిస్తోందని ఫస్ట్ గ్లింప్స్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ వీడియోలో ఆమెని మాత్రం రివీల్ చేయలేదు.

కథలో కీలకపాత్రలోనే అనుష్క శెట్టి కనిపించబోతోందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా దీనిని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. చర్చి ఫాదర్ గ్రామ ప్రజలకి ఓ చోట దెయ్యం ఉందని చెబుతారు. అక్కడ తవ్వకాలు మొదలుపెడతారు. అలా తవ్విన తర్వాత ఒక గృహలో అతీంద్రియ శక్తులతో ఉన్న హీరో పాత్ర రివీల్ అవుతుంది. టీజర్ లో కంటెంట్ చాలా పవర్ ఫుల్ గా ఎలివేట్ చేశారు.

మొత్తంగా 23 భాషలలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. మలయాళీలో అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ శ్రీ గోకులం మూవీస్ నుంచి ఈ చిత్రం రాబోతోంది. అవార్డ్స్ విన్నింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రోజిన్ థామస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి మలయాళీలో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా రాబోతున్న ఈ పాన్ వరల్డ్ సినిమా అనుష్కకి ఎలాంటి ఇమేజ్ తీసుకొస్తుందో చూడాలి.