ప్రేమ..పెళ్లి.. మొత్తానికి క్లారిటీ ఇచ్చిన అనుష్క
ఈ క్రమంలో అనుష్క కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత తాను నటిస్తున్న చిత్రం ఇది అని చెప్పారు
By: Tupaki Desk | 6 Sep 2023 5:51 AM GMTవిభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువ హీరో నవీన్ పొలిశెట్టి. ఆయన హీరోగా, స్టార్ హీరోయిన్ అనుష్క జంటగా కలిసి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి. ఈ సినిమాతో అనుష్క చాలా కాలం తర్వాత తెరపై కనిపించనుందది. అందులోనూ అనుష్క లాంటి స్టార్ హీరోయిన్, యువ హీరో నవీన్ పొలిశెట్టితో చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా రేపు అంటే, సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో అనుష్క కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత తాను నటిస్తున్న చిత్రం ఇది అని చెప్పారు. తానే కావాలని కొంతకాలం గ్యాప్ తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇక ఈ మూవీ తర్వాత గ్యాప్ లేకుండా తాను సినిమాలు చేస్తానని అనుష్క హామీ ఇచ్చారు.
ఇక, ఈ మూవీలో అనుష్క చెఫ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, నిజ జీవితంలోనూ తాను వంటలు బాగా చేస్తానని చెప్పారు. ఎక్కువగా పప్పు , పాస్తా బాగా చేస్తానని చెప్పారు. అయితే, వాళ్ల అమ్మ చేసినంత అద్భుతంగా అయితే చేయలేననని చెప్పారు.
ఇక, తనకు పెళ్లి చేసుకోవాలనే ఉంది అని మనసులో మాట బయటపెట్టారు. తాను పెళ్లికి వ్యతిరేకం కాదు అని చెప్పారు. పెళ్లి, పిల్లలు, కుటుంబ బంధాలు, ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి అని ఆమె చెప్పారు. అయితే, ఇవన్నీ చాలా ఆర్గానిక్ గా జరగాలని చెప్పారు. ప్రేమ పెళ్లి అయినా, ఆరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా ఆర్గానిక్ గా ఉండాలన్నారు. ప్రేమ, ఎమోషన్ లేని పెళ్లి వృథా అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక, ఈ మూవీ విషయానికి వస్తే కథ చాలా సింపుల్ గా ఉంటుందన్నారు. పెద్దగా డ్రామా ఏమీ ఉండదన్నారు. ఇలాంటి కథను ఎంచుకొని, దానికి న్యాయం చేయడం చాలా సవాలుతో కూడుకొని ఉంటుందని, అయితే, డైరెక్టర్ మహేష్ కారణంగా తాము ఎలాంటి కష్టం లేకుండా సినిమా చేయగలిగామని చెప్పారు. ఇక , మూవీలో నవీన్ చాలా అద్భుతంగా నటించాడని, అతని కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని, అతనితో కలిసి పని చేయడం బాగుందని చెప్పారు.