Begin typing your search above and press return to search.

ఎక్కడైనా ప్రభాస్ కటౌట్ చాలు… ఇదే ప్రూఫ్

అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో ప్రమోషన్స్ చేయకపోయిన ప్రభాస్ మూవీ అనే బ్రాండ్ ఉంటే ఆ సినిమాకి ఆటోమేటిక్ గా భారీ ఓపెనింగ్స్ వస్తాయని మరోసారి ప్రూవ్ చేశారు.

By:  Tupaki Desk   |   21 Dec 2023 7:07 AM GMT
ఎక్కడైనా ప్రభాస్ కటౌట్ చాలు… ఇదే ప్రూఫ్
X

ప్రభాస్ కటౌట్ చాలు. ఆటోమేటిక్ గా కలెక్షన్స్ వాటికవే వస్తాయని రీసెంట్ గా ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ సలార్ మూవీ ప్రమోషన్స్ చేయకపోవడానికి చెప్పిన రీజన్ అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఇండియాలో కొంత మంది హీరోలకి మాత్రమే సాధ్యమయ్యే ఇమేజ్ ప్రభాస్ కి ఉంది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు, ఫోటో ఉంటే ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయిన మూవీకి భారీ ఓపెనింగ్స్ వస్తాయి.


అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో ప్రమోషన్స్ చేయకపోయిన ప్రభాస్ మూవీ అనే బ్రాండ్ ఉంటే ఆ సినిమాకి ఆటోమేటిక్ గా భారీ ఓపెనింగ్స్ వస్తాయని మరోసారి ప్రూవ్ చేశారు. ఆదిపురుష్ సినిమాకి ఒక్క ప్రీరిలీజ్ ఈవెంట్ మాత్రమే చేశారు. అయిన కూడా భారీ ఓపెనింగ్స్ ని ఆ సినిమా సొంతం చేసుకుంది. కంటెంట్ లో దమ్ము లేకపోవడం వలన లాంగ్ రన్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

బాహుబలి 2 తర్వాత చెప్పుకోదగ్గ సాలిడ్ హిట్ లేకపోయిన కూడా సలార్ సినిమాపై మళ్ళీ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదని ముందుగా ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. అయితే తాజాగా సలార్ యూఎస్ఏ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడైన టికెట్లు నెంబర్ చూసి అందరూ షాక్ అయ్యారని చెప్పాలి.

ఏకంగా 70 వేల టికెట్లు ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సోల్డ్ అయ్యాయి. అలాగే సినిమా పడకుండానే 1.4 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. 2023లో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్షన్స్ సొంతం చేసుకోలేదు. కేవలం ప్రభాస్ కి మాత్రమే సాధ్యమయ్యే రికార్డ్ ఇదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇదే స్పీడ్ కొనసాగితే మొదటి మూడు రోజుల్లోనే 4 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని సలార్ అందుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి. హైదరాబాద్ లో అయితే మేగ్జిమమ్ థియేటర్స్ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ తో అన్ని షోలు హౌస్ ఫుల్ అయిపోయాయి.