Begin typing your search above and press return to search.

అపరిచితుడు.. రీ రిలీజ్ లో ఎంత వచ్చాయంటే?

కోలీవుడ్ దర్శక దిగ్గజం శంకర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి

By:  Tupaki Desk   |   22 May 2024 4:26 AM GMT
అపరిచితుడు.. రీ రిలీజ్ లో ఎంత వచ్చాయంటే?
X

కోలీవుడ్ దర్శక దిగ్గజం శంకర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఒక్క ఐ మూవీ మాత్రమే డిజాస్టర్ కాగా రోబో 2.ఓ మూవీ ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం శంకర్ నుంచి తమిళంలో పాన్ ఇండియా మూవీగా ఇండియన్ 2 వస్తోంది. తెలుగులో గేమ్ చేంజర్ సిద్ధమవుతోంది. ఇండియన్ 2 మూవీ జులైలో రిలీజ్ కాబోతోంది. దీనికి ప్రస్తుతం శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన సూపర్ హిట్ సినిమాలలో ఒకటైన అపరిచితుడు రీరిలీజ్ అయ్యింది.

చియాన్ విక్రమ్ ని విలక్షణ నటుడిగా టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం చేసింది అపరిచితుడు మూవీ. అందులో మూడు విభిన్నమైన పాత్రలలో విక్రమ్ నటించి మెప్పించాడు. మల్టిపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ ఉన్నవాడిగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులని థ్రిల్ చేశాడు. అపరిచితుడు మూవీ సక్సెస్ లో మేజర్ క్రెడిట్ విక్రమ్ యాక్టింగ్ ని దక్కుతుందని చెప్పొచ్చు. 18 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ మూవీ అన్ని రిలీజ్ అయిన అన్ని భాషలలో సూపర్ హిట్ అయ్యింది.

ఇన్నేళ్ల తర్వాత తెలుగులో అపరిచితుడు సినిమాని రీరిలీజ్ చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో సక్సెస్ లు లేవు. ఏ మూవీ రిలీజ్ అయిన రెండు రోజులకి ఖాళీ అయిపోతుంది. వేసవి కావడంతో ఏప్రిల్, మే నెలల్లో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి అస్సలు ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి సమయంలో మే 17న అపరిచితుడు మూవీ రీరిలీజ్ అయ్యింది.

ఈ చిత్రం మొదటి రోజు 16 లక్షలు గ్రాస్ కలెక్ట్ చేసిందంట. వీకెండ్ తర్వాత కూడా అపరిచితుడు సినిమాని లిమిటెడ్ షోలు వేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 28 లక్షల గ్రాస్ వరకు వసూళ్లు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. టోటల్ రన్ లో 30 లక్షల వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అసలే ప్రేక్షకులు లేక, సరైన సినిమాలు లేక థియేటర్స్ ప్రస్తుతం బోసిపోయాయి.

తెలంగాణాలో అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇలాంటి సమయంలో అపరిచితుడుకి వచ్చిన కలెక్షన్స్ చాలా బెటర్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. థియేటర్స్ యజమానులుకి కొంత వరకు ఈ కలెక్షన్స్ సంతృప్తినిచ్చాయనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే చియాన్ విక్రమ్ పా రంజిత్ దర్శకత్వంలో చేసిన తంగలాన్ మూవీ రిలీజ్ కి సిద్ధమవుతోంది.