Begin typing your search above and press return to search.

ప‌రోటా..గులాబ్ జామ్ క‌లిపి కుమ్మేస్తా!

తాజాగా మరో మాలీవుడ్ భామ అప‌ర్ణ బాల‌ముర‌ళి ఈ ఐట‌మ్ ల‌కు ఫ్యావ‌రెంట్ అంటూ ముందుకొచ్చింది.

By:  Tupaki Desk   |   22 July 2024 1:30 AM GMT
ప‌రోటా..గులాబ్ జామ్ క‌లిపి కుమ్మేస్తా!
X

సౌత్ భామ‌లంతా మంచి పుడీస్. మెజార్టీ వ‌ర్గం నాన్ వెజ్ ప్రియులే కనిపిస్తారు. అందులోనూ మ‌ల‌యాళం నుంచ వ‌చ్చిన భామ‌లైతే మ‌రింత పుడీస్. ముక్క లేనిదే ముద్ద దిగ‌దు అన్న టైప్. న‌జ్రియా న‌జీమ్, నివేధా థామ‌స్, సంయుక్తా మీన‌న్ స‌హా చాలా మంది భామ‌లంతా ఒకే గూటి ప‌క్షులు. వీళ్లంతా ఎప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చిన ఇక్క‌డ చికెన్, మ‌ట‌న్ బిర్యానీల‌ను ఓ ప‌ట్టు ప‌ట్టాల్సిందే అంటారు.

మ‌రికొంత మంది ప్ర‌త్యేకంగా ఓల్డ్ సిటీకి వెళ్లి మ‌రీ నాన్ వెజ్..పాయా లాంటివి రుచి చూస్తుంటారు. తాజాగా మరో మాలీవుడ్ భామ అప‌ర్ణ బాల‌ముర‌ళి ఈ ఐట‌మ్ ల‌కు ఫ్యావ‌రెంట్ అంటూ ముందుకొచ్చింది. ఈ అమ్మ‌డు ప‌రోటా, గులాబ్ జామూన్ ని క‌లిపి తింటుందిట‌. ముందుగా వాటిని విడివిడిగా టేస్ట్ చేసి ఆ త‌ర్వాత రెండింటిని మిక్సింగ్ చేసి లాగించేస్తుందిట‌. అలాగే పొంగ‌ల్ కూడా.

ఈ మూడింటిని ఒకేచోట చూస్తే అస్స‌లు అగ‌లేదుట‌. ఇంట్లో ఉంటే ప్ర‌తీరోజు వాటిని తింటుందిట‌. డైటింగ్ చేసే అల‌వాటు లేదంది. అయితే ఏవీ తిన్న కాస్త త‌క్కువ‌గానే తీసుకుంటుంటుంది. ఎంత అవ‌స‌ర‌మే అంతే తిని వ‌దిలేస్తుందిట‌. మొద‌ట్లో స‌న్న‌గా ఉండేదాన్ని . త‌ర్వాత లావు గా మారాను. దాంతో మీకు అమ్మ పాత్ర సూట‌వుతుందని చాలా మంది ముఖం మీద‌నే అనేవారు.

ఈ అమ్మాయి హీరోయిన్ గా ప‌నికి రాదు అన్న వాళ్లు ఉన్నారు.సోష‌ల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ చూసాను. అవి చూసి మొద‌ట్లో చాలా బాధ‌ప‌డ్డా. అన‌వ‌స‌రం సినిమాల్లోకి వ‌చ్చాను అనిపించింది. కొంత కాలానికి ఆ బాధ‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చా. నా న‌ట‌న చూసి త‌ప్ప‌కుండా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని న‌మ్మా. అదే నిజమైంది` అని తెలిపింది.