Begin typing your search above and press return to search.

ఎన్నిక‌లు+ ఎండ‌లు హీరోలు రెస్ట్!

మ‌రి టాలీవుడ్ హీరోల్లో కూడా ఇదే హాట్ టాపిక్ అవుతుందా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 March 2024 2:30 AM GMT
ఎన్నిక‌లు+ ఎండ‌లు హీరోలు రెస్ట్!
X

ఏపీలో ఎన్నిక‌ల కాక ఎలా ఉందో తెలిసిందే? ఎవ‌రు గెలుస్తారు? అన్న‌దానిపై నిత్యం చ‌ర్చ‌గా మారింది. ఎన్నిక‌లు పూర్తయ్యే ఫ‌లితాలు విడుద‌ల‌య్యే వ‌ర‌కూ ఇదే స‌న్నివేశం క‌నిపిస్తుంది. గ్రామాల్లో సైతం స్థానిక ఎన్నిక‌లు స‌ర్పంచ్ ఎన్నిక‌ల్ని మంచి త‌ల‌పిస్తున్నాయి. ఏ న‌లుగురు క‌లిసినా ఇదే అంశం చ‌ర్చ‌కొస్తుంది. మ‌రి టాలీవుడ్ హీరోల్లో కూడా ఇదే హాట్ టాపిక్ అవుతుందా? అంటే అవున‌నే తెలుస్తోంది.


ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొంద‌రు తెలుగు హీరోలు కూడా షూటింగ్ కూడా బంద్ పెట్టి ఎన్నిక‌ల‌య్యే వ‌ర‌కూ విశ్రాంతి తీసుకోవాల‌నుకుంటున్నారుట‌. వేస‌వి సీజ‌న్ కూడా మొద‌ల‌వ్వ‌డం..రోజు రోజుకి ఎండ‌ల తీవ్ర‌త కూడా పెర‌గ‌డంతో ఏప్రిల్ నుంచి మే వ‌ర‌కూ హాలీడేస్ తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. ముఖ్యంగా ఈ రేసులో టైర్- హీరోలెక్కువ‌గా క‌నిపిస్తున్నారు. చ‌ల్ల‌ని ప్ర‌దేశాల్లో విదేశీ షెడ్యూల్స్ ఉంటే షూటింగ్ చేసుకోవ‌డం లేక‌పోతే ఈ రెండు నెల‌లు పాటు ఇంటిప‌ట్టునే ఉండాల‌నుకుంటున్నారుట‌.

సరిగ్గా ఇదే స‌మ‌యంలో ఏపీలో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో దాన్నో టైంపాస్ గానూ భావిస్తున్న‌ట్లు క‌నిపి స్తుంది. స్టార్ హీరోల్లో ముఖ్యంగా చిరంజీవి..రామ్ చ‌ర‌ణ్‌..వ‌రుణ్ తేజ్ లు ఎన్నిక‌లు పూర్త్యయ్యే వ‌ర‌కూ షూటింగ్ లు చేయాల‌నుకోవ‌డం లేదుట‌. ప‌వన్ క‌ళ్యాణ్ పోటీ బ‌రిలో ఉండ‌టంతో అత‌డికి చేదోడు..వాదోడు గా నిల‌వాలి అన్న ఉద్దేశంతో ఆ ముగ్గురు కొన్ని రోజులు పాటు సెట్స్ కి వెళ్ల‌డం లేద‌ని వినిపిస్తుంది.

ఇక టైర్ -2 హీరోల్లో కొంత‌మంది షూటింగ్ క్లైమాక్స్ వ‌స్తే ఎండ‌లు ముద‌ర‌కుండా వీలైనంత వేగంగా పూర్తి చేసి రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోవాల‌ని..మ‌రికొంత మంది షూట్ డిలే అవ్వ‌డానికి అవ‌కాశం ఉంటే వేస‌వి పోయే వ‌ర‌కూ హీరోలేని స‌న్నివేశాలు చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారుట‌. మొత్తంగా ఎన్నిక‌లు ప్ల‌స్ ఎండ‌లు హీరోల‌కు విశ్రాంతిని ఇస్తున్నాయ‌ని చెప్పొచ్చు.