Begin typing your search above and press return to search.

అపోలో వ్య‌వ‌స్థాప‌కుడిపై ఉపాస‌న పుస్త‌కం

అపోలో గ్రూప్ సంస్థ‌ల అజేయ‌మైన చ‌రిత్ర‌ను తెలుసుకోవాల‌నుకుంటే ఇప్పుడు ఒక ఆప్ష‌న్ ఉంది

By:  Tupaki Desk   |   5 Feb 2024 7:04 PM GMT
అపోలో వ్య‌వ‌స్థాప‌కుడిపై ఉపాస‌న పుస్త‌కం
X

అపోలో గ్రూప్ సంస్థ‌ల అజేయ‌మైన చ‌రిత్ర‌ను తెలుసుకోవాల‌నుకుంటే ఇప్పుడు ఒక ఆప్ష‌న్ ఉంది. చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 91వ‌ పుట్టినరోజును పుర‌స్క‌రించుకుని గర్వించదగిన మనవరాలు ఉపాసన కామినేని కొణిదెల రచించిన మోస్ట్ అవైటెడ్ 'ది అపోలో స్టోరీ'పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. అమర్ చిత్ర కథ సౌజ‌న్యంతో ఈ పుస్త‌కం అందుబాటులో ఉంటుంది.


డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి ఆరోగ్య సంరక్షణకు చేసిన అసమానమైన కృషికి ఈ పుస్త‌కం అంకితం. స్వస్థత కోసం అంకితమైన జీవితాన్ని సెల‌బ్రేట్ చేయ‌డ‌మే దీని ధ్యేయం. అపోలో కథ కేవలం ఒక పుస్తకం కాదు.. ఇది అపోలో హాస్పిటల్స్ సాధించిన‌ మైలురాళ్ల తాలూకా భావోద్వేగ ప్రయాణం.. రాబోయే వారసత్వంలో న‌మ్మ‌కం, విశ్వాసం, ఆశకు చిహ్నంగా నిలుస్తుంది.

'ది అపోలో స్టోరీ' అపోలో మిషన్‌ను నిర్వచించిన సవాళ్లు, ఆవిష్కరణలు, విజయాలను సంగ్రహిస్తూ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి చ‌రిత్రను తెలియ‌జేస్తుంది. ఈ ప్రాజెక్ట్ అపోలో హాస్పిటల్స్ - అమర్ చిత్ర కథ అనే రెండు మూల స్థంభాలను ఏకం చేసింది. వారి భాగస్వామ్యం ప్రాముఖ్యతను ప్రపంచ ప్రేక్షకులతో విశేషమైన వైద్యం వారసత్వాన్ని షేర్ చేసుకోవడానికి ఉపాస‌న ధృక్ప‌థాన్ని నొక్కి చెబుతుంది. ఆరోగ్య సంరక్షణ సాంకేతిక‌త విజయాల వేడుక‌ల‌ను మించి, అపోలో స్టోరీలో ఇక్క‌డ‌ వ్యక్తులు, ముఖ్యంగా మహిళలు, వారి అపరిమితమైన సామర్థ్యాన్ని విశ్వసించేలా పరివర్తన దృష్టి కోణాన్ని హైలైట్ చేస్తుంది.

పుస్త‌కావిష్క‌ర‌ణ‌లో ఉపాస‌న మాట్లాడుతూ.. ఈ పుస్తకం అక్కడ ఉన్న చిన్నారులందరికీ - పెద్దగా కలలు కనాలని.. కథల‌ను చదవడానికి తన తాత ఎలా ప్రోత్సహించి, ప్రేరేపించారో కూడా వెల్ల‌డించారు. తన నలుగురు కూతుళ్లు కష్టపడి పనిచేయడానికి ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో ప్రభావాన్ని సృష్టించడానికి... తండ్రులంతా తమ కుమార్తెల కోసం పెద్ద కలలు కనేలా స్ఫూర్తిని పొందేందుకు ఈ పుస్తకాన్ని చదవాలని అన్నారు.