Begin typing your search above and press return to search.

పోలిటిక‌ల్ కాక ఏపీలోనే కాదు ఇండస్ట్రీలోనూ!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో 2024 సినారే దృష్టిలో పెట్టుకుని ఇక్క‌డా ప‌రోక్షంగా రాజ‌కీయ కాక మొద‌లైన‌ట్లు క‌నిపిస్తోంది

By:  Tupaki Desk   |   1 Aug 2023 6:10 AM GMT
పోలిటిక‌ల్ కాక ఏపీలోనే కాదు ఇండస్ట్రీలోనూ!
X

2024 ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో పొలిటిక‌ల్ కాక ప‌తాక స్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేన‌..టీడీపీ అధికార ప‌క్షాన్ని ఎండ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఆ రెండు పార్టీలు క‌లిసి పోటీ బ‌రిలోకి దిగుతాయా? ఎవ‌రికి వారు స్వ‌తంత్రంగా బ‌రిలోకి దిగుతారా? అన్న‌ది సెకెండ‌రీ. తొలుత అధికార ప‌క్షాన్ని బ‌ల‌హీన ప‌ర్చాల‌న్న ప్ర‌య‌త్నాలైతే సీరియస్ గా చేస్తున్నాయి. మ‌రి అంతిమంగా 2024 లో గెలుపు గుర్ర‌మెక్కేది ఏ పార్టీ అవుతుంద‌న్న‌ది ప‌క్క‌న బెడితే!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో 2024 సినారే దృష్టిలో పెట్టుకుని ఇక్క‌డా ప‌రోక్షంగా రాజ‌కీయ కాక మొద‌లైన‌ట్లు క‌నిపిస్తోంది. పార్టీల వారిగా సినిమాలు చేస్తోన్న స‌న్నివేశం క‌నిపిస్తోంది. సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ ఇప్ప‌టికే అధికార ప‌క్షానికి ఫేవ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న వైనం క్లియ‌ర్ గా ఉంది. ముఖాముఖి ఇంట‌ర్వ్యూల్లో అధికార ప‌క్షాన్ని ఉద్దేశిస్తూ మిగ‌తా రెండు పార్టీల‌పై త‌న‌దైన విశ్లేష‌ణ చేస్తున్నారు. కుట్ర‌లు..ఆలోచ‌న‌లకు మ‌ధ్య‌లో అసామాన్యుడిగా ఎదిగిన నాయ‌కుడి క‌థే వ‌ర్మ 'వ్యూహం'.

ఇది ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సంబంధించిన క‌థ‌గా సంల‌చ‌నం అవుతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే వైఎస్సార్ పాద యాత్ర ఆధారంగా 'యాత్ర' చిత్రాన్ని తెర‌కెక్కించిన మ‌హి.విరాఘ‌వ 'యాత్ర‌-2' టైటిల్ తో మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో 2009 నుంచి 2019 వ‌ర‌కూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిరియ‌డ్ ని చూపిస్తున్నారు. ఆయ‌న ఎదుగుద‌ల‌ని పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు.

మరో ఇద్ద‌రు దర్శ‌కులు కూడా వైసీపీ మ‌ద్ద‌తుగా రెండు సినిమాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. వైసీపీ సంక్షేమ ప‌థ‌కాల ఆధారంగా ఈ చిత్రాలు ఉంటాయ‌ని స‌మాచారం. ఇక ప్ర‌తిప‌క్ష టీడీపీ పార్టీ కూడా వాటికి ఎటాకింగ్ సిద్దం చేస్తున్న‌ట్లు వినిపిస్తోంది. హీరో..హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ చేస్తోన్న‌ సినిమాలోనూ.. ఒక‌రిద్ద‌రు టీడీపీకి అనుకూలంగా ఉన్న ద‌ర్శ‌కులు తీస్తున్న సినిమాల్లోనూ ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా సినిమాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ విష‌యంలో పార్టీ అంత సీరియ‌స్ గా క‌నిపించ‌లేదు.

ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'బ్రో' సినిమా ద్వారా వైసీపీపై దాడి చేసారానే ప్ర‌చారం సాగుతోంది. 'బ్రో' లో పృథ్వీరాజ్ -అంబ‌టి రాంబాబు ను డాన్స్ ని ఇమిటేట్ చేసినట్లు ప్ర‌చారం దానిపై సోష‌ల్ మీడియా లో వార్ తెలిసిందే. కొంత మంది క‌మెడియ‌న్లు జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

ఇక‌ లాంగ్ గ్యాప్ త‌ర్వాత నారా రోహిత్ 'ప్ర‌తినిధి-2' చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీవీ-5 మూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం. న్యూస్ రీడ‌ర్ గా..రాజ‌కీయ విశ్లేష‌కుడిగా..టీడీపీ అననూయ‌గా ఉన్న మూర్తి ఈ సినిమాని తెర‌కెక్కించ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రం. అయితే ఈ సినిమాల‌న్ని ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి రాక‌ముందే మార్చి లోపే రిలీజ్ అవుతాయని తెలుస్తోంది.