వామ్మో.. సినిమాలని తలపించిన ఏపీ ఎన్నికలు
అయితే వారికి ఏపీ ఎన్నికలు చూపిస్తే వీటికంటే సినిమానే బెటర్ అనే అభిప్రాయం రావడం గ్యారెంటీ.
By: Tupaki Desk | 14 May 2024 3:45 AM GMTఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఊహించని స్థాయిలో ప్రజా స్పందన వచ్చింది. గతంలో కంటే ఈ సారి ఓటింగ్ శాతం పెరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఏపీ రాజకీయాలు అంటేనే దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. దేశంలోనే ఎన్నికల కోసం అత్యధికంగా డబ్బులు ఖర్చు చేసే నాయకులు ఏపీలోనే ఉన్నారు. విచ్చలవిడిగా ఓట్ల కోసం డబ్బులు వెదజల్లుతారనే ఆరోపణలు ఉన్నాయి.
ఓటుకు 5 వేల రూపాయిల వరకు కొన్ని చోట్ల ఇచ్చారని.. 10 కోట్ల నుంచి 100 కోట్ల వరకు నియోజకవర్గానికి ఖర్చు చేశారని టాక్స్ నడిచాయి. ఇక గొడవల ఏ రేంజ్ లో నడిచాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే సినిమాల్లో చూపిస్తారని మరోసారి అర్థమైంది. అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం లేకపోవడం వలన అలా జరిగింది ఇలా జరిగింది అని చెబితే వినేవాళ్ళం. కానీ ఈసారి ఎన్నికల వేడి విడియోల రూపంలో సినిమాల సీన్స్ ను తలపించేలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సినిమాలలో చూపించిన తరహాలో హింసాత్మక సంఘటనలు నిజంగా జరిగే అవకాశం లేదని చాలా మంది భావిస్తారు. అయితే వారికి ఏపీ ఎన్నికలు చూపిస్తే వీటికంటే సినిమానే బెటర్ అనే అభిప్రాయం రావడం గ్యారెంటీ. ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలో అయితే సోమవారం ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు సినిమాని మించిన యాక్షన్ ఎంటటైన్మెంట్ ఇచ్చాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఓ ఎమ్మెల్యే పబ్లిక్ గా ఓటర్ మీద దాడి చేయడం. అతని మీద ఓటర్ ఎటాక్ చేశారు. మరో ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లోకి వెళ్లి ప్రత్యర్థి పార్టీ ఏజెంట్ లని బలవంతంగా బయటకి లాక్కొని వచ్చి రిగ్గింగ్ కి పాల్పడే ప్రయత్నం చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు, నాటుబాంబులు విసురుకున్నారు. వెంటాడి, వెంటాడి కొట్టుకుంటూ వెళ్లారు.
పోలింగ్ ఏజెంట్ లని కిడ్నాప్ చేశారు. ఈవీఎం మిషన్ లని ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి రిగ్గింగ్ లకి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఇంటిపైన దాడులు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేని రోడ్ల మీద పరిగెత్తించారు. బలం, బలగం ఉన్నచోట ఓటర్లని సైతం బెదిరించి, భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలు అన్ని కూడా సినిమాటిక్ స్టైల్ లో ఉండటం విశేషం. సోషల్ మీడియాలో కూడా ఏపీ ఎన్నికలే ట్రెండింగ్ లో ఉన్నాయి. అంతలా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇంపాక్ట్ క్రియేట్ చేశాయని చెప్పొచ్చు.