ఆక్వామ్యాన్ VS బ్లాక్ మాన్తా! గెలిచేదెవరు?
తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ కూడా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'ఆక్వామ్యాన్: అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్' టైటిల్ తో ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By: Tupaki Desk | 15 Sep 2023 10:26 AM GMTహాలీవుడ్ నిర్మాణ సంస్థలు వార్నర్ బ్రదర్స్- డీసీ కామిక్స్ నుంచి సినిమా వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తారు. ఇప్పటికే ఈ సంస్థల నుంచి రిలీజ్ అయిన 'ది డార్క్ నైట్ ట్రయోలాజీ'..'బార్బీస , 'హ్యారీ పోటర్ ', 'జోకర్' లాంటి చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ ని సైతం షేక్ చేసాయి. ఐదేళ్ల క్రితం ఇవే నిర్మాణ సంస్థలు 'ఆక్వామ్యాన్' చిత్రాన్ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వరల్డ్ వైడ్ 7000 కోట్లు వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ కూడా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'ఆక్వామ్యాన్: అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్' టైటిల్ తో ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జేమ్స్‌వాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి పార్ట్‌లో లీడ్ రోల్స్ ప్లే చేసిన జాసన్ మోమోవా..అంబర్ హర్డ్ యాధావిధిగా సీక్వెల్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్..టీజర్ తో భారీ అంచనాలు నమొదయ్యాయి. సీక్వెల్ కూడా ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉంటుందని ట్రైలర్ కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నట్లు ఫ్యాన్స్ రివీల్ చేసారు.
తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆక్వామ్యాన్ సముద్ర గర్భంలో ఉన్న అట్లాంటిస్ ప్రపంచానికి సముద్ర రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. కానీ ఆక్వామ్యాన్ రాజుగా ఉండటం నచ్చని బ్లాక్ మాన్తా సముద్ర రాజును అతడి కుటుంబాన్ని నాశనం చేయాలనీ చూస్తాడు. ఈ నేపథ్యంలో ఆట్లాంటిస్ ను కాపాడుకోవడానికి ఆక్వామాన్ ఏం చేసాడు? అన్నది ఆసక్తికరం. విజువల్ గా ట్రైలర్ హై రీచ్ లో ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఈ తేదీ కారణంగా కొన్ని తెలుగు సినిమాలకు ఇబ్బంది తప్పేలా లేదు. అదే నెలలో నాని 'హాయ్ నాన్న...నితిన్ 'ఎక్స్ ట్రాడనరీ' తో పాటు విక్టరీ వెంకటేష్ తొలి పాన్ ఇండియా చిత్రం 'సైంధవ్' రిలీజ్ అవుతున్నాయి. ఆక్వామన్- వీటి రిలీజ్కి పెద్ద వ్యవధి లేదు. దీంతో థియేటర్ల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఓవర్సీస్ లో ఇంగ్లీష్ సినిమాకిచ్చిన ప్రాధాన్యత తెలుగు సినిమాకి ఉండదు. దీంతో అక్కడ థియేటర్లు తక్కువగా దొరికే అవకాశం ఉంటుంది.
ఈ సినిమాలన్నికంటే 'సలార్' గనుక అదే తేదీలో రిలీజ్ అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సలార్ ..ఆక్వామాన్ తో పోటీ పడే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ఆక్వామ్యాన్ తెలుగులోనూ కొంత ప్రభావం చూపిస్తుంది. ఈ జానర్ చిత్రాలకు భారత్ లో ప్రత్యేకమైన అభిమానులున్నారు. అందుకే ఇంగ్లీష్ సినిమాలు కూడా ఇండియాలో 100 కోట్లను సునాయాసంగా తెస్తున్నాయి. కాబట్టి ఆక్వామాన్ రిలీజ్ విషయాన్ని టాలీవుడ్ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది.