Begin typing your search above and press return to search.

మురుగ‌దాస్ క‌థ‌ 30ని.లు విని పారిపోయిన హీరో

పెద్ద స్టార్లతో పనిచేసేటప్పుడు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి బలమైన ఓపెనింగ్‌ను సాధించ‌డానికి కొన్నిసార్లు రాజీలు అవసరమవుతాయి కాబట్టి, స్క్రిప్ట్‌కు పూర్తిగా కట్టుబడి ఉండటం సవాలుగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   23 March 2025 9:09 AM IST
మురుగ‌దాస్ క‌థ‌ 30ని.లు విని పారిపోయిన హీరో
X

ఏ.ఆర్.మురుగ‌దాస్ కొంత గ్యాప్ త‌ర్వాత తిరిగి త‌న అభిమానుల‌ను అల‌రించాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. అత‌డు ప‌రాజ‌యాల నుంచి కోలుకోవాల‌ని ఆరాట‌ప‌డుతున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో స‌ల్మాన్ ఖాన్ హీరోగా సికంద‌ర్ లాంటి భారీ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రం ఈద్ కానుక‌గా 3- మార్చి 2025న థియేటర్లలోకి రానుంది. ప్ర‌స్తుతం చిత్ర‌బృందం ప్ర‌చారంలో బిజీగా ఉంది.

ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో మురుగ‌దాస్ కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ముచ్చ‌టించారు. తాను 30 ని.ల పాటు క‌థ విని స‌ల్మాన్ ఖాన్ పారిపోయార‌ని, అయితే మ‌ళ్లీ తిరిగి వ‌చ్చి, అత‌డు అన్న మాట‌లు షాకిచ్చాయ‌ని మురుగ‌దాస్ తెలిపారు. ''నేను మధ్యాహ్నం 2 గంటల నుండి తెల్లవారుఝామున 2 గంటల వరకు క‌థ వింటాను. మీరు దానికి అంగీకరిస్తున్నారా?'' అని అడిగారని వెల్లడించారు. స‌ల్మాన్ కి తాను చెప్పిన క‌థ అంత బాగా న‌చ్చేసింద‌ని అన్నారు.

సికంద‌ర్ ట్రైల‌ర్ ఈ ఆదివారం విడుద‌ల కానుంది. ట్రైలర్ విడుదలకు సిద్ధ‌మ‌వుతుంటే అభిమానుల ఉత్సాహం అంత‌కంత‌కు రెట్టింప‌వుతోంది. స‌ల్మాన్ తో ఈ సినిమా ఎలా ప్రారంభ‌మైందో కూడా మురుగ‌దాస్ వెల్లిడించారు.

పిటిఐతో ఇంటర్వ్యూలో ఎ.ఆర్. మురుగదాస్ 'హాలిడే' షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్‌తో తన మొదటి సమావేశం కుదిరింద‌ని గుర్తు చేసుకున్నారు. సల్మాన్‌ను పలకరించడానికి వచ్చి ఒక సినిమాకి కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేశారు. సల్మాన్ దానికి సానుకూలంగా స్పందించారు. న్ని సంవత్సరాల తరువాత సల్మాన్ కొరియన్ సినిమా రీమేక్ గురించి చర్చించడానికి సంప్రదించాడు. కానీ మురుగదాస్ నిరాకరించాడు. సూపర్ స్టార్ తో కలిసి పనిచేయాలంటే, అది తాను స్వయంగా రాసిన స్క్రిప్ట్ పైనే ఉండాలని చెప్పాడు. కోవిడ్ స‌మ‌యంలో నిర్మాత సాజిద్ నదియాద్వాలా మురుగదాస్ ను సంప్రదించి మంచి స్క్రిప్ట్ కావాల‌ని కోరాడు. చాలా నెలలపాటు స్క్రిప్టు రెడీ చేసిన‌ తర్వాత ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో సల్మాన్‌తో సమావేశం జరిగింది. స్క్రిప్ట్ చెప్పిన 30 నిమిషాల్లోనే సల్మాన్ వెళ్ళిపోయి...తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు క‌థ విన్నాడ‌ని తెలిపాడు. స్క్రిప్ట్‌కు స‌ల్మాన్ ఆమోదం లభించిందని ఆ స‌మ‌యంలో న‌మ్మాడు.

అలాగే సీన్లు తీసేప్పుడు అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాలకు భిన్నమైన వివ‌ర‌ణ‌లు ఉంటాయని మురుగ‌దాస్ పేర్కొన్నాడు. అలాంటి సందర్భాలలో రెండు వెర్షన్‌లను షూట్ చేసేవాళ్ల‌మ‌ని తెలిపాడు. ఎడిటింగ్ ప్రక్రియలో ఏది బాగా పనిచేస్తుందో దానిని ఉప‌యోగించుకుంటారు. సూపర్ స్టార్ తో రెగ్యులర్ సినిమా తీయడం అనేది కావాల‌ని చేసిన‌ ఎంపిక కాదని, ఎందుకంటే సినిమాలో అభిమానులను ఆకర్షించే అంశాలు ఉండాలి అని దర్శకుడు మురుగదాస్ అన్నారు.

పెద్ద స్టార్లతో పనిచేసేటప్పుడు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి బలమైన ఓపెనింగ్‌ను సాధించ‌డానికి కొన్నిసార్లు రాజీలు అవసరమవుతాయి కాబట్టి, స్క్రిప్ట్‌కు పూర్తిగా కట్టుబడి ఉండటం సవాలుగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అభిమానులను సంతృప్తి పరచడం ప్రాధాన్య‌త‌ కాబట్టి అలాంటి ప్రాజెక్టులలో దర్శకుడిగా 100 శాతం సృజనాత్మక ప్రామాణికతను కొనసాగించడం కష్టమని మురుగదాస్ అంగీకరించారు.