రీమిక్స్ స్వరకర్తలపై AR రెహమాన్ ఆగ్రహం
భారతీయ సంగీత పరిశ్రమలో పాటల రీమిక్స్‌లు, రీఇమాజినేషన్‌లను సహించలేమని రెహమాన్ ఈ ధోరణికి వ్యతిరేకంగా గట్టిగా వాదించారు.
By: Tupaki Desk | 26 Oct 2024 7:50 AM GMTస్వరమాంత్రికుడు, లెజెండ్ ఏ.ఆర్ రెహమాన్ కి తీవ్రమైన కోపం వచ్చింది. అనుమతి లేకుండా చేసే రీమిక్స్ లపై అతడు తీవ్ర స్వరం వినిపించారు. పాత పాటలను రీమిక్స్ చేస్తున్న స్వరకర్తల పనిని AR రెహమాన్ ఊహించలేమని అన్నారు. అనుమతి లేకుండా చేసే ఈ పనిని మళ్లీ ఊహించలేరు! అంటూ సీరియస్ అయ్యారు. భారతీయ సంగీత పరిశ్రమలో పాటల రీమిక్స్‌లు, రీఇమాజినేషన్‌లను సహించలేమని రెహమాన్ ఈ ధోరణికి వ్యతిరేకంగా గట్టిగా వాదించారు. సంగీతంలో కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలపైనా ఆందోళనను వ్యక్తం చేసారు.
హిందీ సంగీతంలో 90ల చివరలో ఈ రీమిక్స్ కల్చర్ ప్రారంభమైంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇది కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఐదారు సంవత్సరాల వయస్సు సినిమాల నుంచి పాటలు కూడా రీమిక్స్ అయిపోతుంటే దానికి రెహమాన్ మనస్తాపానికి గురయ్యారట. ఒక సినిమాలోని పాటను తీసి ఆరేళ్ల తర్వాత మరో సినిమాలో ఉపయోగించడం సరికాదు. మీరు దానిని మళ్లీ రూపొందించడం సరికాదు అని 'ది వీక్' ఇంటర్వ్యూలో అన్నారు. రీఇమేజిన్ చేసిన పాటను సోషల్ మీడియాలో ఉపయోగించవచ్చు కానీ వాణిజ్యపరంగా ఉపయోగించకూడదు. మీరు వ్యక్తుల(ఒరిజినల్ సృష్టికర్త) అనుమతి లేకుండా వారి పనిని మళ్లీ ఊహించలేరు. మీరు దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయవచ్చు. కానీ కచ్చితంగా దీన్ని ప్రధాన స్రవంతి సినిమాల్లో ఉపయోగించలేరు'' అని ఆస్కార్ విజేత రెహమాన్ అన్నారు.
రెహమాన్ ఇటీవలి కాలంలో తన పాటలను రీమిక్స్ చేయడాన్ని చూశానని అన్నారు. 1995 చిత్రం బొంబాయి నుండి హమ్మ హమ్మ పాటను 'ఓకే జాను' (2017)లో రీఇమాజిన్ చేసారని తెలిపారు. అయితే రెహమాన్ 'ఓకే జాను' కోసం సంగీతం కంపోజ్ చేశారు కానీ రీమిక్స్ చేయడంలో పాల్గొనలేదు. సంగీతంలో చాలా పెద్ద సమస్య ఉంది... AI వెరీ బ్యాడ్ అని కూడా రెహమాన్ అన్నారు. ఇంకా పెద్ద చెడు ఏమిటంటే AIని దుర్వినియోగం చేయడం.. స్వరకర్తకు అతడి శైలిని అరువుగా తీసుకున్నప్పుడు అతడికి చెల్లించకపోవడం నైతిక సమస్యలకు దారి తీయవచ్చు.. అని అన్నారు.
కెరీర్ మ్యాటర్‌కి వస్తే.. ఇటీవలే ధనుష్ 'రాయన్'కి రెహమాన్ సంగీతం అందించారు. ఇంతియాజ్ అలీ 'అమర్ సింగ్ చమ్కిలా'కు సంగీతం అందించారు. ఈ రెండిటీకీ ప్రశంసలు దక్కాయి. విక్కీ కౌశల్ -చావా , కమల్ హాసన్-మణిరత్నంల 'థగ్ లైఫ్' చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.