గాంధీ సిరీస్ కి రంగంలోకి రెహమాన్!
జాతిపిత మహాత్మగాంధీ జీవితం ఆధారంగా ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Oct 2024 9:14 AM GMTజాతిపిత మహాత్మగాంధీ జీవితం ఆధారంగా ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో కొన్ని సక్సెస్ అయి మరికొన్ని ఫెయిలయ్యాయి. ఏ కథకైనా ఏమోషన్ అన్నది కీలకం. దాన్ని పర్పెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసిన వారంతా మంచి సక్సస్ అయ్యారు. ఫెయిలైన దర్శకులంతా కూడా ఎమోషన్ క్యారీ చేయడంలో విఫలమవ్వడంతోనే వైఫల్యం తప్పలేదన్నది క్రిటిక్స్ అభిప్రాయం.
ఈ నేపథ్యంలో తాజాగా గాంధీ పై కొత్తగా మరో సిరీస్ కి రంగం సిద్దమవుతోంది. హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ దీన్ని నేడు గాంధీ జయంతి సందర్భంగా వెల్లడిం చింది. ఈ సిరీస్ కి మ్యూజిక్ లెజెండ్ ఏ. ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా రెహమాన్ స్పందించారు. ` ఈసిరీస్ లో గాంధీ జవితం, దేశం కోసం ఆయన చేసిన పోరాటం గురించి తెలుస్తుంది.
హన్సల్ మెహతా దీనికి దర్శకత్వం వహిస్తున్న సిరీస్ కి సంగీతం అందించడం గౌరవంగా ఉందన్నారు. `ఇది తరతరాలకు స్పూర్తినిచ్చే కథ. గాంధీ జీవితంలోనే భావోద్వేగం, ఆధ్యాత్మికతను తెరపైకి తీసుకు రావడమే మా లక్ష్యం` అని చిత్రబృందం తెలిపింది. ఇక రెహమాన్ సంగీతం ఈసిరీస్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఆయన సంగీతం అంటే నేచుర్ నుంచి పుడుతుంది. బయోపిక్స్ లో ఎమోషన్ క్యార్ చేయడంలో రెహమాన్ దిట్ట. ఇప్పటికే ఆయన అలాంటి సక్సెస బయోపిక్ లు ఎన్నింటికో సంగీతం అందించారు. తాజాగా గాంధీ బయోపిక్ కి ఆయన సంగీతం అందించడం కలిసొచ్చే అంశం. అంతర్జాతీయగానూ ఈ చిత్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. గాంధీ కథ కావడం...రెహమాన్ ట్యాలెంట్ ప్రపంచానికి తెలిసిందే.