ఆర్భాజ్- జార్జియా బ్రేకప్‌కి మలైకా కారణమా?
ఆర్భాజ్ నుంచి విడిపోయానని జార్జియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అధికారికంగా వెల్లడించింది. ఇప్పుడు ఈ బ్రేకప్ కి కారకురాలు మలైకా అంటూ మరో ప్రచారం వేడెక్కిస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే...
By: Tupaki Desk | 14 Dec 2023 2:30 AM GMTమలైకా అరోరా - ఆర్భాజ్ ఖాన్ జంట విడాకులు, అనంతరం ఎవరికి వారు డేటింగుల్లో మునిగి తేలడం గురించి తెలిసిందే. ఆర్భాజ్ ఖాన్ నటి కం మోడల్ జార్జియా ఆండ్రియానితో డేటింగ్ ప్రారంభించాడు. అదే సమయంలో మలైకా అరోరా యువహీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేయడం చర్చకు వచ్చింది. మలైకా నుంచి విడిపోయిన అర్బాజ్ విదేశీ బ్యూటీ జార్జియాతో గత నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కానీ ఇటీవల ఈ జంట మధ్య బ్రేకప్ అయిందని ప్రచారం సాగుతోంది. ఆర్భాజ్ నుంచి విడిపోయానని జార్జియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అధికారికంగా వెల్లడించింది. ఇప్పుడు ఈ బ్రేకప్ కి కారకురాలు మలైకా అంటూ మరో ప్రచారం వేడెక్కిస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే...
అర్బాజ్ - మలైకా 1998లో వివాహం చేసుకున్నారు. వారికి అధికారికంగా 2017లో విడాకులు మంజూరు అయ్యాయి. విడాకులు తీసుకున్నప్పటికీ ఆ ఇద్దరూ తమ కొడుకు అర్హాన్ కి సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. జార్జియా నుంచి అర్బాజ్ విడిపోవడానికి మలైకా కారణం అంటూ కొన్ని నిందలు కూడా ఉన్నాయి. అయితే ఈ పుకార్లకు ప్రతిస్పందనగా ఇటాలియన్ నటి-మోడల్ జార్జియా హిందూస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ''ఆమె (మలైకా) వైపు నుండి ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. మేము విడిపోవడానికి ఆమె కారణం కాదు...'' అని వ్యాఖ్యానించడంతో ఒక క్లారిటీ వచ్చింది.
తాము విడిపోవడానికి అసలు కారణాన్ని కూడా జార్జియా తెలిపారు. ''మా మధ్య సంబంధంలో విలువైనది ఒకే విధమైన ఆసక్తులను కలిగి ఉండటం.. కానీ మేం పరస్పర ఆసక్తులను ఒకరితో ఒకరు షేర్ చేసుకోలేదు. ఇది మా సంబంధానికి అనుకూలంగా లేదు. ఉదాహరణకు, నేను విచిత్రమైన వ్యక్తిని.. ఇష్టానుసారంగా ప్రయాణించాలనుకుంటాను. నేను ఖాళీగా ఉండి ఎక్కడికైనా వెళ్లాలని నిర్ణయించుకుంటే, నేను వెళ్తాను. అతడు అదే విధంగా కోరుకోనప్పుడు అది సరైనది కాదు. అర్బాజ్‌కి కూర్చుని సినిమాలు - డాక్యుమెంటరీలు చూడటం చాలా ఇష్టం. నేను అతడి కంటే చాలా భిన్నం.. నేను ఒకచోట కూర్చోలేను'' అని తెలిపారు. ఈ వివరణతో ఇష్టాయిష్టాలు ఆసక్తులు కలవలేదని కూడా జార్జియా స్పష్ఠతనిచ్చింది..
విడిపోయినప్పటికీ జార్జియా తాను -అర్బాజ్ స్నేహపూర్వకంగా ఉన్నామని చెప్పింది. విడిపోయిన తర్వాత జంటల మధ్య 'చేదు' ఉంటుంది. వారు ఒకరికొకరు ఎక్కువ చెప్పుకోలేరు.. కానీ మా విషయంలో అది అలా కాదు. మేము ఇప్పటికీ జోకులు వేసుకుంటాము. నేను ఇప్పటికీ అతడిని చాలా ఇష్టపడుతున్నాను. మేము ఇప్పటికీ టచ్‌లో ఉన్నాము'' అని చెప్పింది.
అర్బాజ్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్ 17లో కో-హోస్ట్‌గా కనిపిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లకు శుక్రవారం- శనివారం రెండింటిలోనూ హోస్టింగ్ బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే అతడి సోదరులు, తోటి నటులు సోహైల్ ఖాన్ - ఆర్బాజ్ ప్రతి ఆదివారం పోటీదారులతో పరిహాసాలాడుతూ వీక్షకులను నవ్విస్తుంటారు.