విడిపోయి నెల కాలేదు అప్పుడే మూడో పెళ్లి!?
ఆ తర్వాత పిల్లల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని అప్పుడప్పుడు స్నేహితులుగా కలుస్తున్నారు. ఇదంతా ఇప్పటికీ జరుగుతుంది
By: Tupaki Desk | 21 Dec 2023 3:30 PM GMTబాలీవుడ్ నటుడు ఆర్బాజ్ ఖాన్ రిలేషన్ షిప్స్ మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీతో కి బ్రేకప్ చెప్పి నెల రోజులు కాలేదు అప్పుడే మూడవ పెళ్లికి రెడీ అయిపోయాడు. మెడలో మూడు ముళ్లు వేసి మరోసారి ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఆర్బాజ్ ఖాన్ తొలుత మలైకా అరోరాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జోడికి పిల్లలు కలరు. చాలా కాలం పాటు కలిసి కాపురం చేసారు. అయితే మనస్పర్దల కారణంగా కొన్నాళ్లకి విడిపోయారు.
ఆ తర్వాత పిల్లల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని అప్పుడప్పుడు స్నేహితులుగా కలుస్తున్నారు. ఇదంతా ఇప్పటికీ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆర్బార్ నటి జియార్జియా ఆండ్రియాని తో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్లు ఇద్దరు కలిసి ఉన్నారు. పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్నది క్లారిటీ లేదు గానీ..కలిసి ఒకే ప్లాట్ లో కొన్నాళ్లు ఉన్నారు. అయితే ఇటీవలే ఈ రిలేషన్ షిప్ కి కూడా అర్బాజ్ పుల్ స్టాప్ పెట్టాడు.
ఈ విషయాన్ని జియార్జియా కూడా ధృవీకరించింది. ప్రేమికులుగా విడిపోయినా మంచి స్నేహితులుగా కలిసి ఉంటామని ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చి నెల రోజులు కాకుండా ఆర్బాజ్ మూడవ పెళ్లికి రెడీ అవుతున్నాడు. మ్యాకప్ ఆర్టిస్టు శురాఖాన్ ని వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ వివాహం ఇరుకుటుంబాల సమక్షంలో ముంబైలో జరుగుతున్నట్లు తెలుస్తుంది.
మరి శురాఖాన్ తో రిలేషన్ షిప్ ఎలా అంటే? ఆర్బాజ్ ఖాన్ గతేడాది 'పాట్నా శుక్లా' అనే సినిమా చేసాడు. ఇందులో అనుష్క కౌశిక్... రవీనా టాండన్ నటించారు. రవీనా కి మ్యాకప్ ఆర్టిస్ట్ శురాఖాన్. ఆమె వద్ద చాలా కాలంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ లో ఆర్బాజ్-శురాఖాన్ మధ్య స్నేహం మొదలవ్వడం అది ప్రేమకు దారి తీయడం..ఇప్పుడు పెళ్లి వరకూ వెళ్లడం జరుగుతుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆర్బాజ్ ఖాన్..ఖురాఖాన్ దృవీకరించాల్సి ఉంది.