ఉప్పెన కాంబో కోసం ట్రై చేస్తున్నారా..?
మెగా మేనల్లుడు మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టినా ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ హిట్ అందుకోవడంలో వెనకపడ్డాడు.
By: Tupaki Desk | 22 March 2024 12:30 AM GMTఫస్ట్ మూవీ అయినా హీరో హీరోయిన్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది అంటే ఆ జోడీ మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. ఇలా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ పెయిర్ గా పాపులారిటీ తెచ్చుకున్నారు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఈ జోడీకి బ్లాక్ బస్టర్ అందుకుంది. తెరంగేట్రం చేసిన ఫస్ట్ మూవీతోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ జంట సూపర్ అనిపించుకుంది. ఉప్పెన హిట్ తో హీరోగా వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. మెగా మేనల్లుడు మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టినా ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ హిట్ అందుకోవడంలో వెనకపడ్డాడు.
ఇక కృతి శెట్టి కూడా ఉప్పెన హిట్ తో అరడజనికి పైగా ఛాన్సులు అందుకుంది. అయితే వాటిల్లో ఉప్పెన తర్వాత రెండు సినిమాలు మాత్రమే హిట్ అందుకోగా మిగతా వన్నీ ఫ్లాప్ అవడంతో డీలా పడింది. ప్రస్తుతం అమ్మడు శర్వానంద్ మనమే సినిమాలో నటిస్తుంది. సినిమాలో అమ్మడు బేబీకి తల్లి పాత్రలో కనిపిస్తుంది.
ఉప్పెన లాంటి హిట్ తో కెరీర్ మొదలు పెట్టినా ఆ తర్వాత ఆ ఫాం కొనసాగించలేకపోయారు. అయితే మళ్లీ ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే తిరిగి లక్ కలిసి వస్తుందని చెప్పుకుంటున్నారు ఆడియన్స్. ఒక సినిమా హిట్ అయితే ఆ కాంబోని రిపీట్ చేస్తూ సినిమాలు చేస్తుంటారు. అదే దారిలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల కాంబో రిపీట్ చేస్తే చూడాలని కోరుతున్నారు ఆడియన్స్.
ఎలాగు ఇద్దరు కెరీర్ స్ట్రగులింగ్ లో ఉన్నారు కాబట్టి తప్పకుండా వీరి కలయికలో సినిమా వస్తే ఉప్పెన బజ్ మళ్లీ ఏర్పడుతుంది. ఇద్దరు కలిసి ఏదైనా మంచి లవ్ స్టోరీ చేస్తే మాత్రం తప్పకుండా సూపర్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఉప్పెన హీరో హీరోయిన్ ఈ ఇద్దరు మళ్లీ సినిమా చేయాలని ఆడియన్స్ కోరుతున్నారు. మరి వారిద్దరు కూడా ఇదే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారో లేదో తెలియాల్సి ఉంది. కృతి శెట్టి పరిస్థితి ఏమో కానీ వైష్ణవ్ తేజ్ లాస్ట్ మూవీ ఆదికేశవ డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఈసారి చేసే సినిమా తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిందే అని కసి మీద ఉన్నాడు మెగా హీరో. అందుకే వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి క్లూస్ బయటకు రాలేదు.