అరియానా.. నాన్ స్టాప్ గ్లామర్ స్ట్రోక్
దర్శకుడు రాంగోపాల్ వర్మ పక్కన ఏ అమ్మాయి కనిపించినా పాపులర్ కావడం మాత్రం ఖాయం.
By: Tupaki Desk | 2 Jan 2024 8:48 AM GMTదర్శకుడు రాంగోపాల్ వర్మ పక్కన ఏ అమ్మాయి కనిపించినా పాపులర్ కావడం మాత్రం ఖాయం. అలా పాపులర్ అయిన అమ్మాయిల్లో అరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసి ఇంకాస్త ప్రజల్లో గుర్తింపు పొందింది. పైగా తన యాటిట్యూడ్ కూడా ప్రత్యేక ఇమేజ్ తీసుకొచ్చింది.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చాక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫొటో షూట్ లతో రచ్చ రచ్చ చేస్తోంది. రోజు రోజుకూ గ్లామర్ డోస్ పెంచుతోంది. సిల్వర్ స్క్రీన్ పై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో అందాలు ఆరోబోస్తోంది. ఈ మధ్య బీచ్ లో ఆమె బికినీ ధరించి పెట్టిన ఫొటోలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే.
తాజాగా ఆమె బ్లాస్టింగ్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ ఓ రీసార్ట్ లో బ్రాలో దర్శనమిచ్చింది. బ్లాక్ బ్రా, కింద లెహంగా వేర్ ధరించి మతులు పోగొట్టింది. నాభి అందాలు ప్రదర్శిస్తూ.. ఒంపు సొంపులతో కుర్రాళ్ల మతి చెడగొట్టింది. మత్తుగా పోజులిస్తూ కుర్రకారు గుండెల్లో అలజడి రేపుతోంది. బొద్దుగా మారిన అరియానా తన అందంతో మరింతగా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతటి చలిలో కూడా చెమటలు పట్టిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె బాడీ పై నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. అయినా తగ్గేదేలే అంటుంది ఈ బ్యూటీ గర్ల్.
ఇదిలా ఉండగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను బాగానే ఎంజాయ్ చేసింది అరియానా. నాలుగైదు రోజులుగా వేడుకల్లో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలనూ పంచుకుంటోంది. తాజాగా మాత్రం బ్రాలో కనిపించి చలిలో చెమటలు పట్టించింది.
ఇక అరియానా ప్రస్తుతం పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ వస్తోంది. రీసెంట్ గా రోల్ రైడాతోనూ ఓ బ్రాండ్ ను ప్రమోషన్ లో పాల్గొంది. డాన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం బుల్లితెరపై తెలుగు మీడియం స్కూల్ షోలో మెరుస్తోంది.