స్టార్ హీరోలను సవాల్ చేసిన స్టార్ విలన్ ఇప్పుడిలా
హీరోలకు ధీటుగా విలన్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ అనూహ్యంగా అతడు నటనారంగాన్ని విడిచిపెట్టాడు.
By: Tupaki Desk | 13 Jan 2025 5:00 AM GMTఒకప్పుడు అతడు స్టార్ హీరోలను సవాల్ చేసాడు. హీరోలకు ధీటుగా విలన్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ అనూహ్యంగా అతడు నటనారంగాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు అతడు ఏం చేస్తున్నాడో తెలిస్తే షాక్ తింటారు. నటుడిగా గొప్ప పేరు తెచ్చుకుని, సడెన్‌గా గ్లామ్ అండ్ గ్లిజ్ ప్రపంచాన్ని వదిలేసి అతడు అలా ఎందుకు మారాడు? అన్నది అభిమానులకు చాలా కాలంగా ఒక సందేహంగానే మిగిలిపోయింది.
అయితే అన్ని సందేహాలకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ ప్రజల అభిమానం చూరగొని కూడా నటన వదిలేసిన సదరు స్టార్ విలన్ ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాలి. అతడి పేరు ఆరిఫ్ ఖాన్. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, అజయ్ దేవగన్ వంటి పెద్ద స్టార్లతో కలిసి నటించాడు. విలన్ గా పెద్ద స్టార్లకు ఛాలెంజర్ అని నిరూపించాడు. అజయ్ దేవగన్ చిత్రం ఫూల్ ఔర్ కాంటే లో విలన్ రాకీ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సల్మాన్ ఖాన్, సునీల్ శెట్టి సినిమాల్లోను ఆరిఫ్ విలన్‌గా నటించాడు. బ్లాక్ బస్టర్ మోహ్రా, దిల్‌జాలే వంటి చిత్రాలలో విలన్‌గా తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆరిఫ్ ఒకానొక దశలో జీవితపరమార్థం తెలుసుకోవాలనుకున్నాడు.
అతడు అశాంతితో కూడుకున్న ఈ ప్రపంచం నుంచి తనను తాను వేరు చేసుకున్నాడు. అకస్మాత్తుగా పాపులర్ నటుడు ఆరిఫ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతడు మత ప్రవక్తగా మారాడు. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి మౌలానాగా ఒక మతానికి సేవలందించాడు. అతడి డ్రమటికల్ ఛేంజ్ కారణంగా ఇప్పుడు గుర్తు పట్టడం కూడా కష్టమే. అయితే తాను జీవితంలో ఇలా మారడానికి కారణం ప్రశాంతత. ఒకానొక దశలో తాను గొప్ప విలన్ అని పేరు తెచ్చుకున్నా కూడా పెద్ద బ్యానర్లు అతడికి అవకాశాలివ్వలేదు. దాంతో చాలా నిరాశపడ్డాడు. కాలక్రమంలో కొన్ని దురలవాట్లు తనలో అశాంతికి కారణమయ్యాయి. దీంతో అతడు తన మనసు మార్చుకున్నాడు. నటన నుంచి వైదొలగి, పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్లాడు. మౌలానాగా అతడు ప్రజలకు మార్గనిర్ధేశనం చేసాడు. ప్రస్తుతం అతడు పొడవాటి గడ్డంతో గుర్తు పట్టలేనంతగా మారాడు. ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉన్నాడు. సొంతంగా యూట్యూబ్ చానెల్ ని కూడా రన్ చేస్తున్నాడు.