Begin typing your search above and press return to search.

హాలీవుడ్ పాప్ స్టార్ల‌నే నెట్టేసిన అర్జిత్ సింగ్!

ఆన్ లైన్ మ్యూజిక్ స్ట్రీమ్ స్పాటీఫై గ‌ణంకాల ప్ర‌కారం హాలీవుడ్ గాయ‌కులు టేలర్ స్విఫ్ట్ - ఎడ్ షీరన్ వంటి అతిపెద్ద పాప్ సింగ‌ర్న‌ల‌నే అధిగమించాడు.

By:  Tupaki Desk   |   9 Aug 2024 7:30 PM GMT
హాలీవుడ్ పాప్ స్టార్ల‌నే నెట్టేసిన అర్జిత్ సింగ్!
X

బాలీవుడ్ సింగ‌ర్ అర్జిత్ సింగ‌ర్ గురించి ప‌రిచ‌యం అస‌వ‌రంలేదు. భార‌త చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో గొప్ప గాయ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఆయ‌న పాట‌లంటే చెవి కోసుకునే శ్రోత‌లెంతో మంది. ఎంతో ఫాలోయింగ్ ఉన్న సింగ‌ర్. మ‌రెంతో మంది అభిమానుల గాయకుడు. తాజాగా ఈ న‌యా సింగ‌ర్ ఏకంగా హాలీవుడ్ ప్టాప్ స్టార్ల‌నే వెన‌క్కి నెట్టేసాడు. ఆన్ లైన్ మ్యూజిక్ స్ట్రీమ్ స్పాటీఫై గ‌ణంకాల ప్ర‌కారం హాలీవుడ్ గాయ‌కులు టేలర్ స్విఫ్ట్ - ఎడ్ షీరన్ వంటి అతిపెద్ద పాప్ సింగ‌ర్న‌ల‌నే అధిగమించాడు.

గ్లోబల్ పాప్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్ కంటే హిందీ మ్యూజిక్ లెజెండ్ ఇప్పుడు కొన్ని వేల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. స్పాటిపైలో అరిజిత్‌కు 117 మిలియన్లకు పైగా అనుచరులు ఉన్నారు. స్పాటీపై ని భారత దేశంలోని చాలా మంది సంగీత ప్రియులు త‌మ మ్యూజిక్ లిజ‌నింగ్ ప్లాంట్ ఫాంగా వినియోగిస్తున్నారు. మ్యూజిక్ ప్ర‌సారానికి గొప్ప సాధ‌నంగా ప‌నిచేస్తుంది. అలాంటి ప్లాంట్ పై అర్జిత్ సింగ్ హాలీవుడ్ పాప్ సింగ‌ర్ల‌ను సైతం వెన‌క్కి నెట్ట‌డం విశేషం.

ఇది ఇదేశీ విదేశీ ప్లాట్ ఫాం. చాలా మంది విదేశీయులు దీన్ని వినియోగిస్తున్నారు. అయితే హాలీవుడ్ సింగర్ల‌ను వెన‌క్కి నెట్ట‌డానికి కార‌ణం మాత్రం భార‌తీయ శ్రోత‌లే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యూజిక్ ప్లాట్ ఫాం లో ఎక్కువ‌గా వినియోగిస్తుంది భార‌తీయులే. ఆరకంగా అర్జిత్ సింగ్ కి క‌లిసొచ్చింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటోన్న సింగ‌ర్ల‌లో అర్జింత్ సింగ్ ఒక‌రు.

ఎలాంటి పాట‌నైనా త‌న గాత్రంతో శ్రోత‌ల్ని అల‌రించ‌డంలో అర్జిత్ స్పెష‌లిస్ట్ అంటూ బిగ్ బీ అమితా బ‌చ్చ‌న్ సైతం ఓ సంద‌ర్భంలో కీర్తించారు. ప్ర‌స్తుతం అర్జిత్ సింగ్ బాలీవుడ్ లో చాలా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే కంపొజ‌ర్ గాను మంచి గుర్తింపు ఉంది.