సముద్ర తీరంలో అరియానా స్టన్నింగ్ గ్లామర్ డోస్
రామ్ గోపాల్ వర్మ చేసిన ఇంటర్వ్యూ ద్వారా బాగా పాపులర్ అయిన యాంకర్లలో అరియనా గ్లోరీ ఒకరు
By: Tupaki Desk | 20 Nov 2023 5:48 AM GMTరామ్ గోపాల్ వర్మ చేసిన ఇంటర్వ్యూ ద్వారా బాగా పాపులర్ అయిన యాంకర్లలో అరియనా గ్లోరీ ఒకరు. అంతకు ముందు వరకు కొన్ని చిన్న చిన్న యూట్యూబ్ ఛానెల్స్ లలో ఇంటర్వ్యూలతో కెరీర్ కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ ఆమెతో ఇంటర్వ్యూ చేశాడో అప్పటినుంచి మరో రేంజ్ కు వెళ్ళిపోయింది. ఈ ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా మెల్లగా గుర్తింపు పొందింది.
అనంతరం బిగ్ బాస్ నాలుగో సీజన్ తో కూడా ఆమె కెరియర్ మలుపు తిప్పింది. ఆ సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన అరియనా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. ఇక తర్వాత చిన్న చిన్న సినిమాలలో కూడా అవకాశాలు అందుకునే ప్రయత్నం చేసిన ఈ బ్యూటీ ఎక్కువగా మాత్రం సోషల్ మీడియా ద్వారానే తన ఉనికిని చాటుకుంటుంది.
ఎక్కువగా గ్లామర్ నీ హైలైట్ చేస్తూ ఫాలోవర్స్ సంఖ్యను కూడా పెంచుకుంటుంది. ఇక రీసెంట్గా సముద్ర తీరం వద్ద దిగిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక గ్లామర్ డోస్ క్లిక్ కావడంతో అవి కాస్త నిమిషాలలొనే వైరల్ అయ్యాయి. అమ్మడు గతంలో కూడా ఇంతకంటే ఘాటైన ఫోటోలు పోస్ట్ చేసింది. కానీ ఈ ఫోటోలలో మాత్రం చాలా అందంగా ఉంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ రియాక్ట్ అవుతున్నారు.
సింపుల్ గా టాప్ లెగ్గిన్ లో కనిపించిన అమ్మడు తన వయ్యారాలతో కుర్రాళ్ళ చూపులు ఒక్కసారి తన వైపుకు తిప్పేసుకుంది. ఈ సముద్రం తనలో ఎన్నో భావాలను కలిగిస్తుంది అని అలాగే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అంటే ఆమె ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ఇక అరియనా ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పుడు మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే బుల్లితెర రియాలిటీ షోలలో కూడా మెరిసే ప్రయత్నం చేస్తుంది. ఆ మధ్య డాన్స్ షోలలో కూడా ఆకట్టుకున్న అరియనా సినిమాలలో కూడా మంచి అవకాశాలు వస్తే చేయాలని అనుకుంది. మరి ఆమె కు తగ్గట్టుగా ఏమైనా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.