Begin typing your search above and press return to search.

వావ్ అరియనా.. ఈ సాహసం చూశారా?

తమ ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోలను షేర్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 1:03 PM GMT
వావ్ అరియనా.. ఈ సాహసం చూశారా?
X

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన వారిలో ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానెళ్లు పెట్టి సెటిల్ అయిపోయారు. ఆ షో వల్ల దాదాపు అందరి కంటెస్టెంట్లు భారీగా ఫాలోవర్లను పెంచుకున్నారు. తమ ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోలను షేర్ చేస్తున్నారు. కొందరు మాజీ బిగ్ బాస్ బ్యూటీలైతే గ్లామర్ డోస్ ఫుల్ గా పెంచేశారు. అందులో అరియానా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.

బిగ్ బాస్ సీజన్ 4లో యూట్యూబర్‌గా అడుగుపెట్టిన అరియానా.. ఆ షో తర్వాత మరింత బిజీ అయిపోయింది. ఇప్పుడు తన ఇన్‌ స్టాగ్రామ్‌లో కొత్త ఫొటోషూట్స్‌ను పోస్ట్ చేస్తూ ఫిదా చేస్తోంది. ప్రస్తుతం దుబాయ్ లో చక్కర్లు కొడుతున్న అరియానా.. తన కొత్త పోస్ట్ తో అందరినీ అట్రాక్ట్ చేసింది. దుబాయ్ లో ఫేమస్ అయిన స్కై డైవింగ్ అడ్వెంచర్ ను ట్రై చేసింది అరియానా.

తన స్కై డైవింగ్‌కు సంబంధించిన కంప్లీట్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘ఈ విధి నా కోసం ఒక కచ్చితమైన టైం టేబుల్ అనేది క్రియేట్ చేసింది. దేవుడు నాకోసం ఇన్ని ఆశీస్సులు దాచి ఉంచాడని ఎప్పుడూ అనుకోలేదు. మీరు జీవించి ఉన్నారు అనిపించే విషయాలతో మాత్రమే మీ జీవితాన్ని నింపేసుకోండి. ఆకాశాన్ని అర్థం చేసుకోవడానికి ఒకే ఒక్క మార్గం అందులోకి దూకడమే’’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.

అయితే స్కై డైవింగ్ కోసం ఫ్లైట్‌ లోకి ఎక్కినప్పటి నుంచి అన్నీ వీడియోలో అరియానా చూపించింది. విమానం నుంచి కిందకు దూకగానే ఇది జీవితంలో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అని, చెప్పడానికి మాటలు రావడం లేదని తన సంతోషాన్ని బయటపెట్టింది. స్కై డైవింగ్ అయిపోయాక తనతో పాటు ఉన్న గైడ్‌ను హగ్ చేసుకొని ఈ ఎక్స్పీరియన్స్ అందించినందుకు థాంక్యూ చెప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అరియానా ధైర్యం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్-4 లో తన గేమ్ తో మనసులు దోచుకున్న అరియానా.. ఆ తర్వాత కొంతకాలం పాటు మూవీ ఇంటర్వ్యూలను చేసింది. బిగ్ బాస్ బజ్ లో కూడా తానే యాంకర్ గా వ్యవహరించింది. బుల్లితెరపై అనేక షోలకు యాంకర్ గా చేసింది. ప్రస్తుతం అరియానాకు ఇన్‌ స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.