Begin typing your search above and press return to search.

కలర్ఫుల్ డ్రెస్ లో అరియానా గ్లామర్ బ్లాస్ట్

ట్రెండీ హెయిర్ స్టైల్ తో కూడా ఆకట్టుకుంది. స్టన్నింగ్ లుక్ లో అరియానా చేసిన ఫొటోషూట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 8:10 AM GMT
కలర్ఫుల్ డ్రెస్ లో అరియానా గ్లామర్ బ్లాస్ట్
X

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న అరియానా గ్లోరీ ఎప్పటికప్పుడు తన న్యూ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ తన ఫాలోవర్స్ ను మరింతగా పెంచుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. క్రేజీ ఫొటోస్టిల్స్ తో మతులు పోగొడుతోంది. కిర్రాక్ లుక్స్ తో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది.


ఇటీవలే అరియానా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రచ్చరచ్చ చేసిన విషయం తెలిసిందే. ఓ ఈవెంట్ లో పాల్గొన్న అరియానా తన స్పెషల్ పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకుంది. సింగర్ రోల్ రైడాతో కూడా ఓ డాన్స్ పెర్ఫామ్ చేసింది. ఆ సమయంలో అట్రాక్టివ్ లుక్ తో అదరహో అనిపించింది. ఎప్పుడూ ఏదో ఒక హాలీడే ట్రిప్ కు వెళ్తూ ఉండే ఈ బ్యూటీ.. తాజాగా దుబాయ్‌లో ల్యాండ్ అయ్యింది.


ఇటీవలే దుబాయిలో ఫేమస్ అయిన స్కై డైవింగ్ చేసిన చేసిన అమ్మడు.. మరోసారి అక్కడే షికారు చేస్తోంది. ట్రిప్ లో ఫస్ట్ డే అంటూ ట్యాగ్ ఇచ్చి పిక్స్ షేర్ చేసింది. సింగిల్ పీస్ డిజైనర్ డ్రెస్ లో అందాలు ఆరోబోసింది. అమ్మాయిలకు ఎంతో నచ్చే పింక్ కలర్ డ్రెస్ లో లుక్స్ తో అదరగొట్టింది. ట్రెండీ హెయిర్ స్టైల్ తో కూడా ఆకట్టుకుంది. స్టన్నింగ్ లుక్ లో అరియానా చేసిన ఫొటోషూట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


అరియానా కొత్త ఫొటోలపై లైకుల వర్షం కురిపిస్తూ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అమ్మడు గ్లామర్ ఫీస్ట్ కు కామెంట్లతో పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. యంగ్ బ్యూటీని మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముద్దుగుమ్మ పిక్స్ చూపుతిప్పుకోనివ్వడం లేదని కామెంట్లు పెడుతున్నారు.


బిగ్ బాస్ సీజన్ 4తో క్రేజ్ సంపాదించుకున్న అరియానా.. ఆ తర్వాత కొంతకాలం పాటు మూవీ ఇంటర్వ్యూలను చేసింది. అంతే కాకుండా బిగ్ బాస్ బజ్‌ లో కూడా తనే యాంకర్‌ గా వ్యవహరించింది. కొన్నాళ్ల నుంచి బుల్లితెరపై పలు షోలకు యాంకర్‌ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం అరియానాకు ఇన్‌ స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.