Begin typing your search above and press return to search.

బ‌న్నీ- అట్లీ దుబాయ్ లో దుకాణం!

ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ స‌హా ఇత‌ర అన్ని ర‌కాల ప‌నుల‌న్ని దుబాయ్ లోనే జ‌రుగుతున్నాయ‌ట‌.

By:  Tupaki Desk   |   19 March 2025 11:59 AM IST
బ‌న్నీ- అట్లీ దుబాయ్ లో దుకాణం!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారికంగా వెల్ల‌డించ‌న‌ప్ప‌టికీ అన‌ధికారంగా ప్రాజెక్ట్ ఫైన‌ల్ అయింది. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ స‌హా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా అట్లీ- బ‌న్నీ దుబాయ్ ని అడ్డ‌గా చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ స‌హా ఇత‌ర అన్ని ర‌కాల ప‌నుల‌న్ని దుబాయ్ లోనే జ‌రుగుతున్నాయ‌ట‌.

ఇటీవ‌లే బ‌న్నీ రెండు...మూడు సార్లు దుబాయ్ వెళ్లొచ్చిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ అట్లీతో ఇంట‌రాక్ట్ అయ్యాడు. ప్రాజెక్ట్ గురించి చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి దుబాయ్ అడ్డాగా చేసుకోవ‌డానికి కార‌ణం ఏంటి? చెన్నై, హైద‌రాబాద్ లు అడ్డ‌గా చేసుకుని ఆప‌రేష‌న్ మొద‌లు పెట్ట‌వ‌చ్చు క‌దా? అన్న సందేహం రావ‌డం స‌హ‌జం. కానీ ఇక్క‌డ డిస్క‌ష‌న్స్ జ‌రిగితే అనేక ర‌కాల స్పెక్యులేష‌న్స్ బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి.

ప్రాజెక్ట్ గురించిన వివ‌రాలు లీక్ అయ్యే ప్ర‌మాదం ఉంది. స్టోరీ లైన్ బ‌య‌ట‌కు రావ‌చ్చు..కాస్టింగ్ డిటైల్స్ లీక్ అవ్వొచ్చు. ఒక్కోసారి ప్రాజెక్ట్ లు ర‌ద్ద‌వ్వ‌డం కూడా జ‌రుగుతున్న‌ది చూస్తుంటాం. ఇలాంటి ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట ప‌డాలంటే విదేశాలైతే ఎలాంటి స‌మ‌స్య రాద‌ని దుబాయ్ లో దుకాణం పెట్టారు. వీట న్నింటిని మించి వంద‌ల కోట్ల రూపాయాల ప్రాజెక్ట్ ఇది. త‌మ‌కు తెలియ‌కుండా లీక్ జ‌రిగినా? నిర్మాత రోడ్డున ప‌డాల్సిన ప‌రిస్థితి ఉంటుంది.

అందుకే సినిమాల విష‌యంలో మేక‌ర్స్ అంత గొప్య‌త వ‌హిస్తుంటారు. ఈ ప్రాజెక్ట్ ను అట్లీ త‌న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ టీమ్‌తో టేక‌ప్ చేస్తున్నాడు. అత‌డి టీమ్ అంతా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తుంది. ప్ర‌స్తుతం అంద‌రూ దుబాయ్ లోనే ఉన్నారు.