Begin typing your search above and press return to search.

జాన్వీ రిస్క్‌ల గురించి కపూర్‌ బ్రదర్‌ కామెంట్స్‌

ఒకే కుటుంబం అయినా జాన్వీ కపూర్‌తో అర్జున్‌ కపూర్‌ సన్నిహితంగా ఉండడు అనే టాక్‌ ఉంది. తాజాగా అర్జున్‌ కపూర్‌ ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   12 Nov 2024 9:30 AM GMT
జాన్వీ రిస్క్‌ల గురించి కపూర్‌ బ్రదర్‌ కామెంట్స్‌
X

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా దూసుకు పోతున్న జాన్వీ కపూర్‌ గురించి ఆమె సోదరుడు అర్జున్‌ కపూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సింగం అగైన్‌ సినిమా విడుదల నేపథ్యంలో ఆ సినిమాలో నటించిన అర్జున్‌ కపూర్‌ మీడియా ముందుకు వచ్చాడు. సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ప్రధానంగా జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్‌లతో తన అనుబంధం గురించి అర్జున్‌ కపూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకే కుటుంబం అయినా జాన్వీ కపూర్‌తో అర్జున్‌ కపూర్‌ సన్నిహితంగా ఉండడు అనే టాక్‌ ఉంది. తాజాగా అర్జున్‌ కపూర్‌ ఆ విషయమై క్లారిటీ ఇచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో అర్జున్‌ కపూర్‌ మాట్లాడుతూ... 'జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్‌ పై నాకు చాలా ప్రేమ ఉంటుంది. ఇద్దరితోనూ నాకు సాన్నిహిత్యం ఉంది. ఒక సోదరుడిగా వారికి నేను ఎప్పుడూ అండగా ఉంటాను. ముఖ్యంగా జాన్వీ కపూర్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఏ విషయంలోనైనా జాన్వీ కపూర్ చాలా నిజాయితీగా ఉంటుంది. అంతే కాకుండా నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ఎప్పుడు కష్టపడుతూ ఉంటుంది. సినిమాల కోసం రిస్క్‌లు తీసుకోవడంకు ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది. నటిగా రిస్క్‌లు తీసుకోవడంకు జాన్వీ సిద్ధంగా ఉండటం నాకు నచ్చుతుంది' అన్నాడు.

జాన్వీ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ నా మద్దతు ఉంటుంది. ఆమె కెరీర్‌లో వ్యక్తిగతంగా మంచి నిర్ణయాలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. ముందు ముందు కూడా ఆమెకు నా మద్దతు పూర్తిగా ఉంటుందని హామీ ఇచ్చాడు. ప్రతి రోజు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఎన్నో విషయాల గురించి మేమిద్దరం మాట్లాడుకుంటాం. ప్రతి విషయం జాన్వీ తనతో చర్చిస్తుందని, తినే ఫుడ్‌ మొదలుకుని సినిమాల ఎంపిక వరకు అన్ని విషయాలు గురించి మేము మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చాడు. మా మధ్య బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం అని పేర్కొన్నాడు.

శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు నాలుగు అయిదు ఏళ్లుగా ఎదురు చూశారు. ఎట్టకేలకు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవర సినిమా విడుదలకు ముందే రామ్‌ చరణ్ సినిమాలోనూ జాన్వీ కపూర్‌కి ఛాన్స్‌ దక్కింది. దర్శకుడు బుచ్చిబాబు ఏరికోరి మరీ రామ్‌ చరణ్ సినిమాలో జాన్వీ కపూర్‌ ను నటింపజేస్తున్నాడు. మరో వైపు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాల్లో ఈమె నటిస్తోంది. అక్కడ ఇక్కడ బిజీగా ఉన్న జాన్వీ కపూర్‌ కి దేవర సినిమా మొదటి కమర్షియల్‌ బ్లాక్ బస్టర్ ను అందించిన విషయం తెల్సిందే. చరణ్ తో చేయబోతున్న సినిమా సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.