ఆ నటుడుకి వారసత్వంతో వచ్చిన వ్యాధి!
తాజాగా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కూడా తనకొచ్చిన జబ్బు గురించి ఓపెన్ అయ్యాడు.
By: Tupaki Desk | 8 Nov 2024 5:29 AM GMTజబ్బులు రావడానికి అనేక కారణాలు. అందులో ఎక్కువగా జబ్బులొచ్చేది వారతస్వం పరంగానేనని డాక్టర్లు ఎక్కు వగా చెబుతుంటారు. తాతలు..ముత్తాతలు..తల్లిదండ్రుల నుంచే రావడానికి అవకాశం ఉందంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు కేన్సర్ బారిన పడి కోలుకున్న వారున్నారు. అంతకుముందే వాళ్ల తల్లులు..తండ్రులు ఆ రకమైన జబ్బుల బారిన పడటంతోనే తమకు వచ్చాయని ఓపెన్ గా చెప్పిన సెలబ్రిటీలు ఎంతో మంది.
తాజాగా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కూడా తనకొచ్చిన జబ్బు గురించి ఓపెన్ అయ్యాడు. `హషీమోటో అనే వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్నాడుట. ఇదొక మానసిక రుగ్మతకు సంబంధించిన వ్యాధిగా చెప్పుకొచ్చాడు. `సింగం ఎగైన్` సినిమా చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా, మానసికంగా, శారీర కంగా అన్ని కోణాల్లోనూ ఇబ్బంది ఎదుర్కున్నాను. సినిమా చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోలేకపోయేవాడిని.
రాత్రిపూట నిద్ర రావడానికి యూ ట్యూబ్ లో వీడియోలు చూసేవాడిని. ఏడాది కాలంగా డిప్రెషన్ నుంచి బయట పడటానికి థెరపీ కూడా తీసుకోవడం మొదలుపెట్టాను. ఇదంతా హషీమోట్ అనే వ్యాధి వల్లే. ఇది మా అమ్మకు, సోదరి కి కూడా ఉంది. ఈ వ్యాధి కారణంగా నా బరువు అదుపులో ఉండేది కాదు. హషీ మోటో అనేది అటో ఇమ్యూనో థైరాయిడ్. ఇది థైరాయిడ్ గ్రంధిని డ్యామేజ్ చేస్తుంది. దీంతో శరీరంలో రకరకాలుగా ఉంటుంది.
అలసట, నిద్రలేమి తనంతో బాధపడతాం. పని మీద శ్రద్ద కలగదు. తెలియకుండానే బరువు పెరుగుతుంది` అని తెలిపాడు. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ రకమైన జబ్బుతో బాధపడుతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఫిట్ నెస్ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా? డైటీషియన్, న్యూట్రిషియన్ ఇలా ఎంత మంది ఉండి ఎన్ని చెప్పినా? అన్ని ఫాలో అయినా? శరీరంలో జరిగే మార్పులు కారణంగా బరువు పెరగడం, తగ్గడం జరుగుతుందని చెబుతుంటారు. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ అధిక బరువు కారణంగా ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో? తెలిసిందే.