Begin typing your search above and press return to search.

త‌న గుట్టు మ‌ట్లు చెల్లికి చెప్పేస్తున్న యంగ్ హీరో!

అర్జున్ క‌పూర్ ఇటీవల `సింగం ఎగైన్‌`లో డేంజర్ లంక అనే పాత్ర‌లో కనిపించాడు. విల‌న్ గా అతడి నటనకు ప్ర‌శంస‌లు కురిసాయి.

By:  Tupaki Desk   |   24 Dec 2024 2:30 AM GMT
త‌న గుట్టు మ‌ట్లు చెల్లికి చెప్పేస్తున్న యంగ్ హీరో!
X

అర్జున్ క‌పూర్ ఇటీవల `సింగం ఎగైన్‌`లో డేంజర్ లంక అనే పాత్ర‌లో కనిపించాడు. విల‌న్ గా అతడి నటనకు ప్ర‌శంస‌లు కురిసాయి. మొద‌టిసారి త‌నయుడి ప్ర‌ద‌ర్శ‌న‌పై తండ్రి బోనీక‌పూర్ కూడా త‌న సంతృప్తిని, ఆనందాన్ని వ్య‌క్తం చేసాడు. త‌దుప‌రి దిల్జిత్ దోసాంజ్, వరుణ్ ధావన్‌లతో క‌లిసి `నో ఎంట్రీ 2`లో అర్జున్ న‌టించాల్సి ఉంది.

ఈ స‌మ‌యంలో అర్జున్ మీడియా ఇంట‌ర్వ్యూల్లో కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను బ‌హిరంగంగా చెబుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. అత‌డు త‌న చిన్న వ‌య‌సులో త‌ల్లిని కోల్పోవ‌డాన్ని వెన్నెముఖ విరిగిపోవ‌డంతో స‌మానంగా భావించాడు. త‌న తండ్రి బోనీకి చాలా కాలం పాటు దూరంగా ఉండిపోవ‌డం మానసిక వేద‌న‌కు గురి చేసింద‌ని అన్నాడు.

తమ మానసిక ఆరోగ్య సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడ‌ట‌మే కాదు.. ఎలాంటి క‌ష్టాలు వ‌చ్చినా అవ‌న్నీ చెప్పుకునేందుకు ఒక‌రు కావాలి క‌దా.. అది మ‌రెవ‌రో కాదు. త‌న సోద‌రి జాన్వీ క‌పూర్ కి మాత్ర‌మే త‌న ర‌హ‌స్యాల‌న్నీ చెప్పుకుంటాన‌ని చెప్పాడు. జాన్వీ తెలివైన అమ్మాయి.. త‌న నుంచి ఓదార్పు ద‌క్కుతుంద‌ని అర్జున్ అన్నాడు. తాను త‌న సోద‌రీమ‌ణులు అన్షులా (సొంత చెల్లి), స‌వ‌తి చెల్లెళ్లు జాన్వీ, ఖుషి కూడా చిన్న వ‌య‌సులోనే త‌ల్లుల‌ను కోల్పోయామ‌ని అర్జున్ ఆవేద‌న చెందాడు. జాన్వీ - ఖుషీల మాతృమూర్తి శ్రీ‌దేవి ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణించ‌గా, అర్జున్- అన్షులా త‌ల్లి మోనా క్యాన్స‌ర్ తో మృతి చెందారు.

త‌ల్లిని కోల్పోవ‌డంతో త‌న‌కు అన్నీ సోద‌రీమ‌ణులే. త‌న విష‌యాల‌న్నిటినీ ముగ్గురిలోను ఎక్కువ‌గా జాన్వీతో షేర్ చేస్తుంటాన‌ని అర్జున్ అన్నారు. చెల్లెళ్ల కోసం బాధ్య‌త గ‌ల అన్న‌య్య‌గా అత‌డు ప‌రిణ‌తితో వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ప్ర‌స్తుతం త‌న కెరీర్ ని చ‌క్క‌దిద్దుకునేందుకు అర్జున్ ప్ర‌ణాళిక‌ల్లో ఉండ‌గా, జాన్వీ, ఖుషీ కెరీర్ కోసం బోనీ క‌పూర్ తెలివైన ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు.