వాళ్లిద్దరి మధ్య బంధం తెగిపోయింది..ఇదే సాక్ష్యం!
అయితే కొంత కాలంగా ఆ జోడీ దూరంగా ఉందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 29 Oct 2024 6:25 AM GMTబాలీవుడ్ సంచలన జోడీ అర్జున్ కపూర్- మలైకా అరోరా రిలేషన్ షిప్ గురించి తెలిసిందే. ప్రేమకు..రిలేషన్ షిప్ కి వయసుతో సంబంధం లేదంటూ బంధాన్ని ఎంతో గొప్పగా తీసుకెళ్లారు. అయితే కొంత కాలంగా ఆ జోడీ దూరంగా ఉందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. కొన్ని రకాల సంకేతాలు సైతం దూరం పెరిగినట్లుగానే హింట్ ఇచ్చాయి. కలిసి వెళ్లాల్సిన వేడుకలకు ఎవరికి వారు సింగిల్ గా హాజరవ్వడంతో సందేహాలు మరింత బలపడ్డాయి.
అయితే దూరం పెరిగిందనిగానీ, బ్రేకప్ జరిగినట్లు గానీ ఇంతవరకూ ఎక్కడా ప్రకటించలేదు. ఇరువురు సైలెన్స్ మెయింటెన్ చేసారు. దీంతో మౌనం అర్దాంగీకారం అన్నట్లు ఈ జోడీ కూడా దూరమైందనే ప్రచారం పీక్స్ లో జరిగింది. అయితే తొలిసారి అర్జున్ కపూర్ ఈ ప్రచారం గురించి సూచన ప్రాయంగా స్పందించాడు. ఓ ఈవెంట్ కి హాజరైన అర్జున్ కపూర్ తాను సింగిల్ గానే ఉన్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అధికారికం అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు ఊపందుకున్నాయి.
ఇంతకాలం నెట్టింట జరిగిన బ్రేకప్ ప్రచారమంతా నిజమేనని కన్పమ్ అవుతుంది. అయితే దీని గురించి మలైకా అరోరా మాత్రం ఎక్కడా స్పందించలేదు. ఆమె నుంచి కూడా ఓ వివరణ రావాలంటూ నెటి జనులు పోస్టులు పెడుతున్నారు. ఇద్దరు 2018 నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. లవ్..రిలేషన్ షిప్ మొదలైన తర్వాత ఇరువురు ఎంతో క్లోజ్ గా మూవ్ అయ్యారన్నది ప్రపంచానికి తెలిసిందే.
ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం భారీగా ఉన్నా? ప్రేమకు వయసుతో పనిలేదని బంధాన్ని ముందుకు సాగించారు. పెళ్లి చేసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అది పెళ్లి వరకూ దారి తీయనట్లు ఖరారవుతుంది. ప్రస్తుతం ఇద్దరు ఎవరు పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అర్జున్ కపూర్ నటించిన `సింగం ఎగైన్` ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.